Home Movie News సోషల్ మీడియా లో వస్తున్న విమర్శలపై మెహబూబ్ షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా లో వస్తున్న విమర్శలపై మెహబూబ్ షాకింగ్ కామెంట్స్

0 second read
0
0
1,555

తెలుగు బుల్లితెర పై ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్లో సృటించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ ఒక్క రియాలిటీ షో ద్వారా స్టార్ మా ఛానల్ ఇండియా లోనే నెంబర్ 1 ఎంటెర్టైనేమేంట్ ఛానల్ గా నిలిచింది, కరోనా మహమ్మారి తో పోరాడి విసుగెత్తిపోయిన జనాలకు బిగ్ బాస్ రియాలిటీ షో ఒక్క గొప్ప రిలీఫ్ ఇచ్చింది అనే చెప్పాలి, స్టార్ మా ఛానల్ లో ఇంతకు ముందు జరిగిన మూడు సీసన్స్ కంటే ఈ సీసన్ కి కనివిని ఎరుగని స్థాయిలో రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ వచ్చాయి అంటే, ప్రేక్షకులు ఈ షో ని ఎంత ఆసక్తిగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు, మధ్యలో దేశం మొత్తం ఎదురు చూసే ఐ పీ ఎల్ వంటి సీసన్స్ వచ్చిన కూడా బిగ్ బాస్ టీ ఆర్ పీ రేటింగ్స్ ఇసుమంత కూడా తగ్గకపోవడం ని చూస్తుంటే ఫామిలీ ఆడియన్స్ కి ఈ రియాలిటీ షో కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు అనే అర్థం చేసుకోవాలి, గడిచిన మూడు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ గొప్ప సెలెబ్రిటీలు కాకపోయినా, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను అద్భుతంగా ఆడుతూ ప్రతి ఒక్కరు ఎవరికీ వారు ప్రత్యేకమైన క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పచుకున్నారు, ఇది ఇలా ఉండగా గత వారం రోజుల నుండి సోహెల్ మరియు మెహబూబ్ కి సంబందించి ఒక్క వీడియో సోషల్ మీడియా వైరల్ అయ్యి తీవ్రమైన విమర్శలకు గురి అయ్యేలా చేస్తున్నాయి.

ఇక అసలు విషయానికి వస్తే టాప్ 5 కంటెస్టెంట్స్ గా మిగిలిన ఇంటి సభ్యులను కలుసుకునేందుకు ఎలిమినేట్ అయినా ఇంటి సభ్యులందరినీ బిగ్ బాస్ మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్ళు హౌస్ లోకి అడుగు పెట్టి టాప్ 5 కంటెస్టెంట్స్ తో పాటు జనాలకు కూడా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చారు, అలా సోహెల్ కి బెస్ట్ ఫ్రెండ్ అయినా మెహబూబ్ కూడా వచ్చాడు, ఆయన కాసేపు హౌస్ మెట్లు అందరితో సరదాగా మాట్లాడుతూ, చివరిగా తిరిగి వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ సోహెల్ కి టైటిల్ గెలవలేవు డబ్బులు తీసుకొనే ఛాన్స్ వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకు అంటూ హింట్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియా లో దానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది, మెహబూబ్ ఇచ్చిన ఆ హింట్ వల్లే సోహెల్ డబ్బు తీసుకొని బయటకి వచ్చాడు అని సోషల్ మీడియా లో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి, మీరు కూడా ఆ వీడియో కి సంబంధించిన ఫోటోను క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు, అయితే సోషల్ మీడియా పై వస్తున్నా ఈ ట్రోల్ల్స్ ని సోహెల్ పట్టించుకోకపోయినా మెహబూబ్ మాత్రం దానికి దీటైన సమాధానం ఇచ్చాడు, ఆయన ఏమి మాట్లాడాడో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత మెహబూబ్ ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘సోహెల్ ఆ పాతిక లక్షలు తీసుకొని చాల తెలివైన పని చేసాడు, వాడికి ఆర్ధిక స్తొమత కి కానీ ,వాడు కనే కలలకి కానీ ఆ డబ్బులు ఎంతో అత్యవసరం , ఎంతో కస్టపడి ఆడాడు వాడు, ఇండస్ట్రీ కి వచ్చిన 8 ఏళ్ళ తర్వాత వాడు గొప్ప సక్సెస్ ని చూడడం నాకు ఎంతో అనందం ని కలిగించాయి, చాలా రోజుల తర్వాత హౌస్ లోకి వెళ్లి వాడిని చూసిన వెంటనే నా కళల్లో నీళ్లు తిరిగాయి, సోషల్ మీడియా నేను వాడికేదో హింట్ ఇచ్చాను అంటూ విమర్శలు రావడం నా దాకా వచ్చాయి, నేను వాడికి ఎలాంటి హింట్ ఇవ్వలేదు, నాకు అసలు ఆ అవకాశం ఒక్కటి ఉంటుంది అనేది కూడా తెలియదు’ అంటూ చెప్పుకొచ్చాడు మెహబూబ్, బిగ్ బీఫాస్ గ్రాండ్ ఫినాలే లో మెహబూబ్ కూడా ప్రత్యేక ఆకర్షణ గా నిలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, సోహెల్ తానూ పాతిక లక్షలు గెలుచుకున్న తర్వాత అందులో అయిదు లక్షలు మెహబూబ్ కి ఇస్తాను అని ప్రకటించగా,మెహబూబ్ దానిని తిరిగి చారిటీ కి ఇస్తాను అని చెప్పడం, వీళ్లిద్దరి మనసు ని అర్థం చేసుకొని నాగార్జున మరియు చిరంజీవి చెరో పది లక్షహాలు అదనంగా ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సంఘటన ఇప్పటికి మంచి ట్రేండింగ్ లోనే ఉన్నది, మరి బిగ్ బాస్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ కాంటెటంట్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే కొద్దీ కాలం వేచి చూడక తప్పదు.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…