Home Movie News సోషల్ మీడియా లో వస్తున్న విమర్శల పై నాగార్జున షాకింగ్ కామెంట్స్

సోషల్ మీడియా లో వస్తున్న విమర్శల పై నాగార్జున షాకింగ్ కామెంట్స్

0 second read
0
1
6,050

తెలుగు బుల్లితెర పై సెన్సేషన్ సృష్టించిన సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గవ సీజన్లో ముగిసి వారం అవుతున్న కూడా ఇప్పటికి ఈ షో కి సంబంధించిన ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది, గడిచిన మూడు సీసన్స్ కంటే ఈ సీజన్లో భారీ బ్లాక్ బస్టర్ అవ్వడం, రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ రావడం తో పాటు ఈ సీజన్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కూడా బాగా పాపులర్ అయ్యి మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు, పోయిన ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే లో అందరూ అనుకున్నట్టు గానే అభిజీత్ బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్నాడు,ఇది ఇలా ఉండగా గ్రాండ్ ఫినాలే పూర్తి అయినా తర్వాత సోహెల్ మరియు మెహబూబ్ కి సంబంధించిన ఒక్క వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది, టాప్ 5 కంటెస్టెంట్స్ ని కలుసుకోవడానికి పాత ఇంటి కంటెస్టెంట్స్ అందరిని చివరి వారం లో మల్లి హౌస్ లోకి బిగ్ బాస్ తీసుకొని వచ్చినప్పుడు మెహబూబ్ సోహెల్ కి పబ్లిక్ లో తన స్థానం గురించి చెప్పి డబ్బులు తీసుకొని వచ్చేయమని ఇంటి సబ్యులకు హింట్ ఇచ్చినట్టు గత వారం రోజుల నుండి ఒక్క వీడియో వైరల్ అవుతూ సోహెల్ పై తీవ్రమైన విమర్శలు వచ్చేలా చేసాయి.

కానీ సోహెల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఆ వీడియో పై ఇచ్చిన క్లారిటీ తో విమర్శల జోరు కి కాస్త ఫుల్ స్టాప్ పడేలా చేసింది, ఆయన దీనిపై వివరణ ఇస్తూ ‘ మెహబూబ్ గాడు ఆరోజు నాకు ఏమి సిగ్నల్ ఇచ్చాడో వాడు ఈరోజు మీ ముందు చెప్పేవరకు నాకు అర్థం కాలేదు, నేను ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ కౌంట్ ఎంత అని అడిగాను, వాడు దానికి సింబాలిక్ గా చెప్పాడు, అయినా బిగ్ బాస్ లో ఎప్పుడు ఏమి జరుగుద్ది అనేది ఎవరికీ తెలీదు, అలాంటిది మెహబూబ్ కి ఎలా తెలుస్తాది, నాకు ప్రైజ్ మనీ గురించి నిజంగా ముందే తెలిసి ఉంటే , మూడు సార్లు ప్రైజ్ మనీ తీసుకొనే అవకాశం వస్తే ఎందుకు రిజెక్ట్ చేస్తా?, 20 లక్షలు ఇస్తాము అన్నప్పుడు కూడా నేను తీసుకోలేదు, ఎప్పుడైతే పాతిక లక్షలు ఇస్తాము అని చెప్పారో , నేను ముందుగానే పెట్టుకున్న టార్గెట్ ని గెలుచుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది కాబట్టి నేను వదులుకోలేదు, ఇంత చిన్న లాజిక్ మీరెలా మిస్ అయ్యారు అంటూ’ సోహెల్ చేసిన కామెంట్స్ అందరికి న్యాయం అనే అనిపించాయి.

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో సోహెల్ మరియు మెహబూబ్ పై వస్తున్నా విమర్శల పై నాగార్జున స్పందిస్తూ ‘ బిగ్ బాస్ షో ని ఇంతలా ఆదరిస్తూ వస్తున్నా తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు చేస్తున్నాను, బిగ్ బాస్ లో ఎవ్వరు గెలవాలి అనేది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది, వోటింగ్ సిస్టం ఎప్పుడు ఎవరికీ ఎలా మారుతుందో బిగ్ బాస్ టీం కూడా అంచనా వెయ్యలేదు, అలాంటిది కంటెస్టెంట్ కచ్చితంగా వీళ్ళే గెలుస్తారు అని సోషల్ మీడియా వెబ్సైట్లు ప్రచురించే వార్తలు నమ్మకండి, గత వారం రోజుల నుండి సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న మెహబూబ్ మరియు సోహెల్ వీడియో నా దృష్టికి కూడా వచ్చింది, కానీ అందులో అంతలాగ విమర్శించే విషయం ఏమి ఉందొ నాకు ఇప్పటికి అర్థం కాలేదు,అసలు మెహబూబ్ ఇచ్చిన సిగ్నల్ ఏమిటి , దాని పర్ఫెక్ట్ గా ఆరా తియ్యమని నేను బిగ్ బాస్ టీం ని రిక్వెస్ట్ చేస్తాను, ఒక్కవేల మీరందరు చేస్తున్న కామెన్స్ నిజం అని ఆ విచారణ లో తేలితే కచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము’ అంటూ చెప్పుకొచ్చారు అక్కనినేని నాగార్జున.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…