Home Entertainment సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న డైరెక్టర్ కొరటాల శివ లేటెస్ట్ కామెంట్స్

సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతున్న డైరెక్టర్ కొరటాల శివ లేటెస్ట్ కామెంట్స్

0 second read
0
0
620

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతమంది టాప్ డైరెక్టర్స్ ఉన్న కొంత మంది డైరెక్టర్లు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికి చెరగని ముద్రని వేసి తమకోసమే థియేటర్స్ కి ఆడియన్స్ ని రప్పించేంత బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకున్న డైరెక్టర్స్ మాత్రం అతి తక్కువ మండే ఉన్నారు, ఆ అతి తక్కువ మందిలో ఒక్కడే కొరటాల శివ,డైరెక్టర్ కాకముందు ఈయన టాలీవుడ్ ని ఒక్క ఊపు ఊపేసేన ఎన్నో సినిమాలకు కథ మరియు మాటలు అందించిన సంగతి మన అందరికి తెలిసిందే, భద్ర, సింహ, బృందావనం, మున్నా, ఒక్కడున్నాడు మరియు ఊసరవెల్లి ఇలా ఎన్నో సినిమాలకు ఆయన కథ మరియు మాటలు అందించాడు, ఇక 2013 వ సంవత్సరం లో విడుదల అయినా మిర్చి సినిమాతో డైరెక్టర్ గా మారిన ఈయన, తోలి సినిమాతోనే ఎలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన టాలీవుడ్ లో అసలు ఇప్పటి వరుకు అపజయం ఎరుగని డైరెక్టర్ ఎవరయ్యా అంటే మొట్టమొదట మనకి గుర్తుర్హు వచ్చే పేరు ఎస్ ఎస్ రాజమౌళి, ఆయన తర్వాత అదే స్థాయిలో ఒక్క పరాజయం లేకుండా అద్భుతమైన గ్రాఫ్ ని మైంటైన్ చేస్తున్న డైరెక్టర్ అంటే అది కొరటాల శివ మాత్రమే అని చెప్పొచ్చు.

ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసారు, ఇది ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా కొరటాల శివ కి సంబంధించిన ఒక్క వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది,ఇక అసలు విషయానికి వస్తే కొరటాల శివ త్వరలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే,వీళ్లిద్దరి కాంబినేషన్ లో మిర్చి తర్వాత మరో సినిమా రాలేదు,అయితే ప్రభాస్ ఈ సినిమాని కూడా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే నిర్మించాలి అనే ప్రతిపాదనని కొరటాల ముందుకి తీసుకొచ్చాడు అట, అయితే ఆ బ్యానర్ లో సినిమా చెయ్యడానికి నాకు ఇష్టం లేదు అండీ, వాళ్లకి నాకు మనస్పర్థలు ఉన్నాయి,మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేద్దాం అంటూ బదులు ఇచ్చాడు అట కొరటాల, అయితే ప్రభాస్ దీనికి సుముఖం గా లేనట్టు సమాచారం, ఎందుకంటే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ స్నేహితులది అవ్వడమే ప్రధాన కారణం, బాహుబలి సిరీస్ మినహా మిర్చి, సాహూ, మరియు రాధే శ్యామ్ వంటి సినిమాలు అన్ని వీళ్ళే నిర్మించారు, అంతేహ్ కాకుండా ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ లో వీళ్ళకి ఎన్నో థియేటర్స్ కూడా ఉన్నాయి, వీటిల్లో ప్రభాస్ కూడా భాగస్వామి.

అయితే యూవీ క్రియేషన్స్ తో ఇలాంటి అనుబంధం ఉన్న ప్రభాస్, కొరటాల చెప్పినట్టు వింటాడా లేదా అనేది ప్రశ్న, లేకపోతే తనని డైరెక్టర్ ని చేసిన హీరో ప్రభాస్ కాబట్టి, ఆయన మీద ఉన్న గౌరవం తో ఒప్పుకొని చేస్తాడా అనేది చూడాలి,ఇది ఇలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు,ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్యమైన పాత్రని పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈయన పాత్ర సినిమాకి ఆయువు పట్టు లాంటిది అట, రామ్ చరణ్ కి జోడిగా పూజ హెగ్డే హీరోయిన్ గా నటించగా చిరంజీవి కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది ,ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు సెరవేగంగా జరుగుతున్నాయి,ఇటీవలే చివరి షెడ్యూల్ లో చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే ఒక్క పాట ని చిత్రీకరించారు ,ఈ సినిమాలో చిరంజీవి మరియు రామ్ చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి అట, మరి భారీ అంచనాలు నెలకొన్న ఆచార్య సినిమా ని ప్రేక్షకులు ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటారో తెలియాలి అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 వ తారీకు వరుకు ఆగాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…