
స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కోసం ప్రేక్షకులు ఎంతలా ఎదురు చూస్తారో అందరికీ తెలిసిందే..ఈ షో ద్వారా అప్పటి వరకు మానెవ్వరికి తెలియని ఎంతో మంది సెలెబ్రిటీలు లైం లైట్ లోకి వస్తారు..అప్పటి వరకు వాళ్ళు ఎన్ని సినిమాలు మరియు ఎన్ని సీరియల్స్ చేసినా కూడా రాని గుర్తింపు ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా వస్తుంది..అందుకే బిగ్ బాస్ అవకాశం ని వాళ్ళు దేవుడు ఇచ్చే వరం లాగా భావిస్తారు..అలా ఎంతో మంది ఈ షో ద్వారా ఫేమ్ తెచ్చుకొని ఇప్పుడు ఇండస్ట్రీ లో హీరో గా హీరోయిన్స్ గా ఎదిగే రేంజ్ కి వచ్చారు..అలా బిగ్ బాస్ షో ద్వారా ఆ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్ సోహైల్..ఈయన సీజన్ 4 లో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే..’కథ వేరే ఉంటాది’ అనే డైలాగ్ కొడుతూ మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఈయన, నిజమనే కథ మార్చేసి టాప్ 3 లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ని తీసుకొని బయటకి వచ్చి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
అయితే సోహైల్ కి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు బాగానే వచ్చాయి..రెండు నుండి మూడు సినిమాల వరకు ఆయన హీరో గా నటించాడు..వాటిల్లో ‘లక్కీ లక్ష్మణ్’ అనే సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతుంది..ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది..ఈ ఈవెంట్ లో సోహైల్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘చాలా కస్టపడి ఈ సినిమా చేసాము..ఈ నెల 30 వ తారీఖున థియేటర్స్ లో విడుదల కాబోతుంది..కచ్చితంగా ఈ సినిమా మిమల్ని అలరిస్తుంది..సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత మీ ముఖం లో కచ్చితంగా నవ్వు ఉంటుంది..అందుకు నేను రాసి ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు..అంతే కాకుండా సోషల్ మీడియా లో తనపై వచ్చే నెగటివ్ కామెంట్స్ గురించి సోహైల్ చాలా ఘాటుగా స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నాపై నెగటివ్ కామెంట్స్ చేసే ప్రతీ ఒకరిని నేను గౌరవిస్తా..ఎందుకంటే మీరే మమల్ని ముందుకు తీసుకెళ్తున్నారు..కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళని కూడా ప్రస్తావించి తిడుతున్నారు..ఇదే మీకు చివరి వార్నింగ్..ఇంకోసారి మీరు అలాంటి కామెంట్స్ చేస్తే కొడకల్లారా మీ కామెంట్స్ లింక్ పట్టుకొని మీ ఇంటికి వచ్చి మరీ కుక్కని కొట్టినట్టు కొడతా..కొడకల్లారా ఏమనుకుంటున్నారు మీరు..కోట్లు పెట్టి మేము సినిమాలు తీసి రెస్పాన్స్ ఎలా ఉందొ అని కామెంట్స్ చూసుకోవడానికి వచ్చినప్పుడు మీరు తిట్టే తిట్లు చూసి ఎంత బాదేస్తుందో తెలుసా..కేవలం నా మీదే కాదు..ఇండస్ట్రీ లో పని చేసే ఏ డైరెక్టర్ ని అయినా , హీరోని అయినా , హీరోయిన్ ని అయినా ఇంట్లో వాళ్ళని ఉద్దేశించి గలీజ్ గా తిడితే మాత్రం..మీ ఇంటికి వచ్చి మరీ కొడుతా..మీకు తిట్టాలి అనిపిస్తే మమల్ని తిట్టండి..ఇంట్లో వాళ్ళ జోలికి పోవద్దు’ అంటూ సోహైల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.