
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల మధ్య ఎలాంటి పోటీ వాతావరణం నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , ఒక్కరిని మించి ఒక్కరు క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ పాన్ ఇదని లెవెల్ లో మన తెలుగు సినిమా ఖ్యాతిని విస్తరింపచేస్తున్నారు, బాహుబలి సినిమా తో మన తెలుగు సినిమా ఖ్యాతిని దర్శక ధీరుడు రాజమౌళి ఏ స్థాయిలో తీసుకెళ్లాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలోనే మన తెలుగోడి సత్తాని చూపిన సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా , ఈ సినిమా బాలీవుడ్ లో సృష్టింసీఝిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసిన పుష్ప మేనియా తో బాలీవుడ్ మొత్తం ఊగిపోయింది, సినిమా స్టార్స్ నుండి క్రికెటర్స్ వరుకు పుష్ప సినిమా మేనియా తో దేశం ఊగిపోయింది అనే చెప్పాలి, ఇక బాహుబలి సినిమాతో రాజమౌళి మరియు పుష్ప సినిమా తో అల్లు అర్జున్ టాలీవుడ్ కి ద్వారాలు తెరవడం తో ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరో తమ సినిమాని తెలుగు తో పాటు హిందీ లో కూడా విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.
ఇది ఇలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఒర్మాక్స్ ప్రతి నెల ఇండియా వైడ్ పాపులారిటీ సాధించిన టాప్ 10 హీరోల లిస్టు ని విడుదల చేస్తూ ఉంటుంది, ఆలా ఈ నెల కూడా టాప్ 10 ఫేమస్ స్టార్ హీరోల లిస్ట్ ని విడుదల చేసింది, అందులో అల్లు అర్జున్, మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ మరియు ఎన్టీఆర్ లు నిలిచారు, పుష్ప సినిమా తో ఇండియా వైడ్ సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ మొదటి స్థానం లో నిలబడగా ,యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రెండవ స్థానం లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు మూడవ స్థానం లో ఉన్నట్టు , అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాల్గవ స్థానం లోను కొనసాగుతున్నట్టు ఈ సర్వే తెలుపుతుంది,ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రొమోషన్స్ తో మంచి పాపులారిటీ ని సాధించిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు 5 మరియు ఆరవ స్థానాల్లో కొనసాగుతున్నారు, ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతోంది.
తోలి ఆరు స్థానాల్లో నేటి తరం స్టార్ హీరోలు నిలబడగా ఆ తర్వాతి నాలుగు స్థానాల్లో విజయ్ దేవరకొండ , న్యాచురల్ స్టార్ నాని , విక్టరీ వెంకటేష్ మరియు మెగాస్టార్ చిరంజీవి కొనసాగుతున్నారు,ప్రస్తుతం ఈ పూర్తి లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు అనే చెప్పాలి,ఇక ప్రతి స్టార్ హీరో బాలీవుడ్ లో కూడా తమ సినిమాలను దబ్ చేస్తారు కాబట్టి భవిష్యత్తు లో ఈ లిస్ట్ లో ఉన్న వారి స్థానాలు మారే అవకాశం ఉంది , ఇటీవలే టాలీవుడ్ లో సెన్సషనల్ హిట్ గా నిలిచినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ సినిమా వచ్చే నెల లో బాలీవుడ్ లో ఘనంగా విడుదల కానుంది, ఈ సినిమా క్లిక్ అయితే పవన్ కళ్యాణ్ కూడా బాలీవుడ్ ని ఒక్క ఒప్పు ఊపేయొచ్చు, మరి చూడాలి పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం బాలీవుడ్ లో పుష్ప రేంజ్ హిట్ అవుతుందా లేదా అనేది.