Home Entertainment సోషల్ మీడియా ప్రకంపనలు రేపుతున్న సమంత లేటెస్ట్ కామెంట్స్

సోషల్ మీడియా ప్రకంపనలు రేపుతున్న సమంత లేటెస్ట్ కామెంట్స్

0 second read
0
1
1,650

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏమాయ చేశావె సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన ఆమె బృందావనం, ఈగ, దూకుడు, మనం వంటి సినిమాలతో వరుస హిట్లు సాధించి టాలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్‌ స్థానాన్ని కొట్టేసింది. తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న సమంత తన గ్లామర్ లుక్‌తో మాత్రం కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. తొలి సినిమా సమయంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే కొన్నాళ్లకే వీరి వివాహం పెటాకులుగా మారింది. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అభిమానులు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్తుంది. తాజాగా ఓ నెటిజన్ ట్వీట్‌కు బదులిస్తూ తన చావుపై సమంత కీలక వ్యాఖ్యలు చేసింది.

హీరోయిన్‌ సమంత షూటింగ్‌లు లేకపోతే ఎక్కువగా జిమ్‌లో లేదంటే పెట్స్‌తో గడుపుతుంటుంది. అంతేకాదు పెట్స్‌తో తనకున్న అనుబంధాన్ని అనేక సందర్భాల్లో అభిమానులకు తెలియజేస్తుంటుంది. అందులో భాగంగా ఇటీవల తన పెంపుడు కుక్కతో దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ పోస్ట్‌కు ఓ నెటిజన్ మీరు పిల్లులతో, కుక్కలతో ఒంటరిగా చనిపోవాలి అంటూ సమంతను ఉద్దేశించి కామెంట్‌ చేశాడు. దీనికి స్పందించిన సమంత అలా జరిగితే తనను తాను అదృష్టవంతురాలిగా భావిస్తానంటూ రీట్వీట్ చేసింది. ఈ కామెంట్‌కు మరొకరైతే ఘాటు సమాధానం చెప్తారు. కానీ సమంత చాలా పాజిటివ్‌గా తీసుకుంది. దీంతో చావుపై సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది. గుణశేఖర్ శాకుంతలం సినిమాతో పాటు యశోద, ఖుషి అనే సినిమాలను సమంత చేస్తోంది. ఈ మూవీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

సమంత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ కెరీర్‌లో జెడ్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. ఆమె వెండితెరపైనే కాకుండా ఓటీటీ ఆహాలో సామ్ జామ్ అనే షోకు కూడా హోస్టింగ్ చేసింది. సొంతంగా వ్యాపారాలు కూడా ప్రారంభించింది. పలు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా నిలిచింది. మరోవైపు పొట్టి బట్టలతో గ్లామర్ లుక్‌లతో అందర్నీ తన వైపు మలుపుకుంటోంది. ఐటమ్ సాంగ్స్‌లోనూ నటిస్తూ సమంత తనలోని మరో కోణాన్ని బయటపెడుతోంది. గ్లామర్ పరంగా అవకాశాలు కూడా బాగా అందుకుంటోంది. దీంతో అటు టాలీవుడ్, కోలీవుడ్‌లపైనే కాకుండా బాలీవుడ్‌ వైపు కూడా ఈ ముద్దుగుమ్మ దృష్టి సారించింది. కాగా సమంత ఒక్కో సినిమాకు రెండు నుండి మూడు కోట్లు తీసుకుంటుందని టాక్ నడుస్తోంది. అంతేకాదు సమంత తన పదేళ్ల కెరీర్‌లో మొత్తం రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తులు సంపాదించిందని ప్రచారం జరుగుతోంది. సమంతకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఒక విలాసవంతమైన ఇంటితో పాటు రెండు కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ కార్లు రెండు ఉన్నాయి. అలాగే ఒక జాగ్వార్ కారు కూడా ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…