
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ఇటీవల పవన్ బర్త్ డే సందర్భంగా హరిహరవీరమల్లు ప్రత్యేక టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవర్ గ్లన్స్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ తొలిసారిగా పీరియాడిక్ సినిమాలో నటిస్తుండటంతో ఆయన అభిమానులు ఊగిపోతున్నారు. ఒక వారియర్‌గా తమ హీరోను ఫస్ట్ టైం చూడబోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే టీజర్ హిట్ అయిందని ఆనందించేలోపే.. అంతలోనే హరిహరవీరమల్లు సినిమా టీమ్‌కు షాక్ తగిలింది. ఈ సినిమాలో హీరో ఎంట్రీ సీన్ లీకైనట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది.
లీకైన సన్నివేశంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించాడని అభిమానులు చెప్తున్నారు. మరోవైపు ఇంటర్వెల్ సీన్ కూడా లీక్ కాగా ఈ సీన్‌లో పవన్‌ను బంధించగా నీ కోసం ఒకరు వచ్చినా నిన్ను వదిలేస్తాం అని విలన్ చెప్పగా.. పవన్ కోసం వేల సంఖ్యలో సైనికులు తరలివస్తారు.. ఇది ఇంటర్వెల్ సీన్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే హరిహరవీరమల్లు అభిమానుల్లో అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ఇటీవల విడుదల చేసిన టీజర్‌లో చిత్ర యూనిట్ పేర్కొంది. అయితే డేట్ మాత్రం చెప్పలేదు. గతంలో మార్చి 30న విడుదల చేస్తామని చెప్పగా ప్రస్తుతం షూటింగ్ లేట్ అవుతుండటంతో ఆ డేట్‌కు రిలీజ్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరి ఏప్రిల్ లేదా మే నెలల్లో హరిహర వీరమల్లు భారీ స్థాయిలో విడుదల కానుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానరుపై ఏఎమ్ రత్నం సమర్పణలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. పునర్జన్మల నేపథ్యంలో సాగే కథగా ఇది తెలుస్తుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీ 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపొందుతోంది. ఇది ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది. ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు హరిహర వీరమల్లు షూటింగ్ యాభై శాతం పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరించేలా హరిహర వీరమల్లు చిత్రం రూపు దిద్దుకుంటోంది. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా పేరొందిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్ కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు.