Home Entertainment సోను సూద్ అరెస్ట్?? ఆందోళనలో ఫాన్స్..అసలు ఏమి జరిగిందో చూడండి

సోను సూద్ అరెస్ట్?? ఆందోళనలో ఫాన్స్..అసలు ఏమి జరిగిందో చూడండి

0 second read
0
0
256

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజల ఇక్కట్లను చజూసి చలించిపోయిన సోనుసూద్,పేద ప్రజల కోసం ఎలాంటి సేవ కార్యక్రమాలు చేసాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, మన దేశం లోనే కాదు, ప్రపంచం లోనే ఈ కరోనా కాలం లో సోను సూద్ చేసిన సేవ కార్యక్రమాలు ఎవ్వరు చెయ్యలేదు అనే చెప్పాలి, కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల సొంత ఊర్లకు వెళ్లకుండా ఆగిపోయిన కొన్ని వేళా మంది వలస కార్మికుల్ని క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపే కార్యక్రమం తో ప్రారంభం అయినా సోను సూద్ సేవలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి,వేల కోట్ల రూపాయిల ఆస్తులు గలిగిన ఎంతోమంది రాజకీయ నాయకులూ మరియు సినీ ప్రముఖులు ఒక్క రూపాయి కూడా తమ జాబు నుండి తీసి ప్రజల కోసం ఖర్చుపెట్టని మనుషులు ఉన్న ఈ కాలం లో, తానూ కస్టపడి సంపాదించిన డబ్బుని నలుగురు బాగు కోసం ఖర్చు చేస్తూ, అవి కూడా సరిపక పోతే తన ఆస్తులను సైతం తాకట్టు పెట్టిన ఏకైక నటుడు సోను సూద్,అలాంటి సోను సూద్ త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి సంచలనం రేపుతున్న వార్త, అసలు సోను సూద్ చేసిన తప్పు ఏమిటి? , ఎవ్వరు ఆయన పై కేసు పెట్టారు అనేది ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా తెలుసుకోబోతున్నాం.

ఇక అసలు విషయం లోకి వెళ్ళితే సోను సూద్ కి ముంబై లో ఆరు అంతస్తుల భవనం ఉంది, దీనిని ఆయన మొదటి నుండే నివాస గృహం గా వాడుతున్నారు, కానీ ఆయన గత కొంత కాలం క్రితం ఈ ఆరు అంతస్తుల నివాస భవనం ని కమర్షియల్ హోటల్ గా మార్చారు, అయితే దీని పై బీఎంసీ అధికారులు తీవ్రమైన అభ్యన్తరం వ్యక్త పరిచారు, సోను సూద్ మా అనుమతి లేకుండానే ఆయన ఈ భవనం ని హోటల్ గా నడుపుతున్నాడు అని, పలు మార్లు ఆయనకి నోటీసులు పంపిన లెక్క చెయ్యలేదు అని, ఆయన నుండి ఎలాంటి స్పందన రాకపోవడం తో సోను సూద్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామని, తక్షణమే ఆయనని అరెస్ట్ చెయ్యాలని బీఎంసీ అధికారులు ఈ సందర్భంగా తెలిపారు, అంతే కాకుండా సోను సూద్ ఈ భవనం లో అక్రమంగా కొన్ని నిర్మించాడు అని, రెండు మూడు సార్లు తనిఖీ చేసి మార్పులు చెయ్యమని చెప్పిన ఆయన మార్చేలేదు అని, వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆయన పైన కేసు వేసాము అని ఈ సందర్భంగా బీఎంసీ అధికారులు సమాధానం ఇచ్చారు, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హుల్చల్ సృష్టిస్తుంది.

అయితే వీటి పై సోను సూద్ స్పందిస్తూ తానూ అక్రమంగా ఎలాంటి హోటల్ నడపట్లేదు అని , అన్ని అనుమతులు తీసుకొనే నడుపుతున్నాను అని, కాకపోతే మహారాష్ట్ర చోస్తల్ జోన్ అథారిటీ నుండి మాత్రమే అనుమతి రావాలి అని, ఆ ప్రక్రియ ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది కానీ , కరోనా పరిస్థితుల వల్ల ఆలస్యం అవుతుంది అని ఆయన ఈ సందర్భంగా స్పందించారు, ఒక్కవేల మహారాష్ట్ర కోస్టల్ జోన్ అథారిటీ అనుమతి ని ఇవ్వకపోతే ఆకు ఈ ఆరు అంతస్తుల భవనం ని మళ్ళీ నివాస భవనం గా మార్చడానికి సిద్ధం గా ఉన్నాను అంటూ సోను సూద్ ప్రకటించారు, ప్రస్తుతం ఈ వార్త నేషనల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, ఇది ఇలా ఉండగా సోనూసూద్ ప్రస్తుతం తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య మరియు బెల్లం కొండా సాయి శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, వీటిలో ఆచార్య సినిమా షూటింగ్ దశలో ఉండగా, అల్లుడు అదుర్స్ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది, వీటితో పాటు ఆయన బాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరో గా నటించడానికి ఒప్పుకున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…