
ముంబై బొద్దుగుమ్మ హన్సిక టాలీవుడ్‌లో అగ్రహీరోలతో కలిసి పనిచేసింది. 2007లో అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె తన క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేకేత్తించింది. దీంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఎన్టీఆర్‌తో కంత్రి, ప్రభాస్‌తో బిల్లా, రామ్‌తో మస్కా, కందీరీగ, రవితేజతో పవర్, కళ్యాణ్‌రామ్‌తో జయీభవ, నితిన్‌తో సీతారాముల కళ్యాణం లంకలో లాంటి సినిమాలను చేసింది. అయితే ఎక్కువ విజయాలు లభించకపోవడంతో ఇతర భాషలకు చెందిన సినిమాల్లోకి వెళ్లిపోయింది. అయితే అంతకంటే ముందు బాలనటిగానూ హన్సిక అలరించింది. 2001 నుంచే షకలక బూమ్ బూమ్, హమ్ దో హై వంటి సీరియళ్లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. అంతే కాకుండా హవా, కోయ్ మిల్ గయా, అబ్రక దబ్రా, జాగో వంటి సినిమాల్లో కూడా కనిపించింది. హన్సిక ప్రస్తుతం కోలీవుడ్‌లోనే బిజీగా ఉంటోంది. తాజాగా ఆమె వివాహం చేసుకుంది. ప్రియుడు, తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ను పెళ్లి చేసుకుంది.
హన్సిక-సోహైల్ ఎంతో కాలం నుంచి మంచి స్నేహితులు. ఈ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల ప్రేమ అనంతరం కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే హన్సిక వివాహంపై సోషల్ మీడియాలో నెటిజన్‌లు విమర్శలు చేస్తున్నారు. గతంలో హన్సిక బెస్ట్ ఫ్రెండ్ సోహైల్‌ను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని విభేదాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత సోహైల్‌ను హన్సిక ప్రేమించింది. దీంతో ఫ్రెండ్ భర్తను పెళ్లిచేసుకోవడానికి సిగ్గులేదా అంటూ పలువురు చీవాట్లు పెడుతున్నారు. ఇలా ఫ్రెండ్‌కు ద్రోహం చేస్తావని కలలో కూడా ఊహించలేదని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి పెళ్లి చేసుకుని హాయిగా ఉందామని భావించిన హన్సిక తనను ఇలా ట్రోల్ చేయడం పట్ల అసహనం వ్యక్తం చేస్తోంది. హన్సిక గతంతో తన మానవత్వంతో మంచి పేరు తెచ్చుకుంది. ప్రతి పుట్టినరోజు ఒక అనాథ అమ్మాయి లేదా అబ్బాయిని దత్తత తీసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. హన్సిక దత్తత తీసుకున్న పిల్లల సంఖ్య 20కి పైగానే ఉంటుంది. అంతేకాకుండా ఎంతో మంది అనాధ పిల్లలకు సహాయం కూడా చేసింది.
మరోవైపు కోలీవుడ్‌లో హన్సిక అఫైర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో శింబుతో ప్రేమాయణం నడిపింది. ఒకదశలో శింబును పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వీళ్లిద్దరూ విడిపోయారు. కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా ‘ఆప్ కా సరూర్’ సినిమాతో హన్సిక తన లక్‌ని పరీక్షించుకుంది. అక్కడ కూడా హిట్ కొట్టడంతో మనీ హై తో హనీ హై వంటి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. హన్సిక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె తండ్రి ప్రదీప్ మోత్వానీ వ్యాపారస్తుడు, తల్లి మోనా మోత్వానీ ప్రసిద్ధి చెందిన చర్మవైద్యురాలు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హన్సిక సంరక్షణా బాధ్యతలను తల్లి మోనా చూసుకుంటోంది. హన్సికకు పాలంటే అస్సలు నచ్చవట. ఏ మాత్రం తీరిక దొరికినా వంట చేయడానికి ఆసక్తి చూపిస్తుందట. అలాగే ప్రయాణం చేస్తూ లోకమంతా చుట్టిరావడమంటే చాలా ఇష్టమట. ఇంట్లో ఆమెకున్న పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ తన బ్రదరే అంటూ చాలాసార్లు వెల్లడించింది.