Home Entertainment సొంత పేరు ని మార్చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..షాక్ లో ఫాన్స్

సొంత పేరు ని మార్చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..షాక్ లో ఫాన్స్

1 second read
0
0
332

సినిమా వాళ్లకు చాలా నమ్మకాలు ఎక్కువ. సాధారణంగా సినిమా వాళ్లు ఎక్కువగా న్యూమరాలజీని నమ్ముతుంటారు. తమకు మంచి హిట్లు రావాలని, తమ జీవితంలో కొత్త కొత్త విజయాలను అందుకోవడానికి తమ పేరులో కొన్ని అక్షరాలను యాడ్ చేయడం, ఇంకొన్ని అక్షరాలు తొలగించుకోవడం చేస్తూ ఉంటారు. అందుకే చాలా మంది సినిమాల్లోకి వచ్చాక పేర్లు మార్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ జాబితాలో ఉంటారు. ఆయన పేరు శివశంకర వరప్రసాద్. అయితే సినిమాల్లోకి వచ్చాక తన పేరును చిరంజీవిగా మార్పు చేసుకున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి పేరు మార్చుకున్నారా అంటే నిజమే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చిరు ఇంగ్లీష్ పేరులో కొత్తగా మూడో ‘ఈ’ ను యాడ్ చేశారు. ఇటీవల గాడ్ ఫాదర్ టైటిల్ పోస్టర్ లో కూడా చిరు కొత్త పేరుతో దర్శనమిచ్చాడు.

చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఖైదీ 150 మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీలో నటించాడు. అయితే ఆ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా నిరాశపరిచింది. ఇటీవల ఆచార్య మూవీతో ప్రేకక్షుల ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. తాజాగా చిరంజీవి పేరు మార్చుకోవడానికి కారణం ఆచార్య సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా చిరు దాదాపు రూ. 70 కోట్లు నష్టపోయాడు. దీంతో చిరు న్యూమరాలజిస్ట్‌ను కలిసి పేరు మార్చుకున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. తాజాగా రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ మూవీ పోస్టర్‌లో మెగాస్టార్ చిరంజీవి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కుర్చీలో కూర్చున్న తీరు, రాజసం ఉట్టి పడుతోన్న విధానం అదిరిపోయింది. ఇక గాడ్ ఫాదర్ టైటిల్ అనేది చిరంజీవికి యాప్ట్ అయిందని సినీ ప్రియులు అంటున్నారు. అదేవిధంగా టీజర్ గ్లింప్స్ కూడా ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ వీడియోలో సునీల్ కారు డోర్ తీయగా.. కారులో నుంచి చిరంజీవి బయటకు వచ్చే స్టైల్ సూపర్‌గా ఉంది.

కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్‌ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపిస్తుండగా.. నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్‌గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ- సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే చిరంజీవి న్యుమరాలజీ ప్రకారం కావాలనే తన పేరును మార్చుకున్నట్లు వస్తున్న వార్తలను చిరంజీవి సన్నిహితులు ఖండిస్తున్నారు. గాడ్ ఫాదర్ యూనిట్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు జరిగిన మిస్టేక్ మాత్రమే అని, చిరు ఎలాంటి న్యూమరాలజిస్ట్ సలహా తీసుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఎడిటింగ్ తప్పిదం వల్ల ఇంకో E అనే లెటర్ యాడ్ అయ్యిందని మరోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని చిత్రబృందం వివరిస్తోంది. మరి ఈ వార్తలపై చిరు క్లారిటీ ఇస్తే పుకార్లకు తెర పడతుందని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…