
మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు, ఒక్క నాగబాబు తప్ప.హీరో గా కెరీర్ ప్రారంభం లో పలు సినిమాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ అవ్వకపోయేలోపు క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని యూ టర్న్ తిప్పాడు.మిగిలిన క్యారక్టర్ ఆర్టిస్టులతో పోలిస్తే ఈయనకి పెద్ద రోల్స్ అయితే ఏమి రాలేదు కాదు,అవకాశాలు మాత్రం బాగానే వచ్చేవి.తెలుగు , తమిళం మరియు కన్నడ భాషలు కలిపి ఈయన దాదాపుగా 200 సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా చేసాడు.ఇక ఆ తర్వాత ఈయన నిర్మాతగా కూడా పలు సినిమాలు తీసాడు.వాటిల్లో బావగారు బాగున్నారా సినిమా తప్ప మిగిలినవన్నీ అట్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.కానీ చిరంజీవి తో ఆయన తీసిన రుద్ర వీణ అనే చిత్రానికి మాత్రం నేషనల్ అవార్డు దక్కింది.అలా జాతీయ పురస్కారం అందుకున్న సినిమాని నిర్మించిన నిర్మాతగా నాగబాబు నిలిచాడు.
కానీ ఆయన నిర్మాతగా మారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని పెట్టి తీసిన ‘ఆరంజ్’ చిత్రం మాత్రం నాగబాబు కి చావు దెబ్బ తగిలిందనే చెప్పాలి.ఇష్టమొచ్చినట్టు అప్పులు చేసి ఈ సినిమాని రిచ్ గా నిర్మించాడు, కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది.అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లిపోయిన సమయం లో పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి సమయానికి ఆదుకున్నారు.ఆ తర్వాత కొడుకు వరుణ్ తేజ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం, నాగబాబు కి సినిమాల్లో అవకాశాలతో పాటు జబర్దస్త్ వంటి పాపులర్ షో కి న్యాయనిర్ణేత గా రావడం తో ఆర్ధిక బాగా పుంజుకున్నాడు.ప్రస్తుతానికి ఇంతకు ముందు లాగ రెగ్యులర్ గా కాకుండా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ , తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా తర్వాత కాస్త బ్రేక్ తీసుకొని నాగబాబు చేసిన చిత్రం ‘శ్రీదేవి శోభన్ బాబు’ ఇటీవలే విడుదలైంది.ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన పలు ఇంటర్వూస్ లో నాగబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు.కానీ ఈమధ్య ఒక్కరు కూడా నాకు వాళ్ళ సినిమాల్లో నటించే అవకాశం ఇవ్వడం లేదు.కానీ సుస్మిత నాకు ఆ అవకాశం ఇచ్చింది.గతం లో ఆమె నిర్మించిన ఒక వెబ్ సిరీస్ లో కూడా నేను నటించాను, తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగబాబు.ఈమధ్యనే విడుదలైన ఈ సినిమాకి పర్వాలేదు అనే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.