
సీనియర్ హీరోయిన్ లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. అల్లుడా మజాకా, మా ఆవిడ కలెక్టర్, మురారి వంటి సినిమాల్లో అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఆమె ప్రస్తుతం స్టార్ హీరో సినిమాల్లో బామ్మ పాత్రలు చేసి మెప్పిస్తోంది. ఓ బేబీ, గ్యాంగ్ లీడర్ చిత్రాల్లో ఆమె నటన అద్భుతం. అయితే ఆమె కూతురు ఐశ్వర్య లక్ష్మీ కూడా తెలుగువారికి సుపరిచితమే. కల్యాణ వైభోగమే, ఓ బేబీ చిత్రాల్లో నాగశౌర్యకు తల్లిగా నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో జీవితం ఎప్పుడు ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పడం కష్టం. కోట్లకు పడగలెత్తినా టక్కున కిందపడి పోతుంటారు. తిండికి లేక ఇబ్బంది పడినా.. టైం కలిసొచ్చి కోట్లు సంపాదిస్తుంటారు.. టైమ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం చాలా కష్టం. ఇలా ఇబ్బందులు పడినవారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. స్టార్లుగా ఎదిగి కుప్పకూలిపోయిన వారు కోకొల్లలు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ఒకరు.
ఒకప్పుడు కోలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను అనుభవించిన ఐశ్వర్యా భాస్కరన్ ఇప్పుడు అవకాశాలు లేక, డబ్బు కోసం ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు అమ్ముకొంటుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆర్థిక కష్టాలను వెల్లడించారు. ఈ మధ్యకాలంలో తనకు అవకాశాలు లేవని.. ఆదాయం కూడా లేదని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు గడవాలంటే డబ్బు అవసరం అని.. అందుకే డబ్బు కోసం ఇంటి ఇంటికి తిరిగి సబ్బులు విక్రయిస్తున్నానని కన్నీటి పర్యంతం అయ్యారు. మంచి జీతం ఇస్తే పాచి పనులు చేయడానికి కూడా వెనుకాడనని ఐశ్వర్య తెలిపారు. ఇప్పుడు తాను చేస్తున్న పని ఎంతో సంతోషంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఇప్పుడు తనకు అప్పులు లేవని.. వేరే సమస్యలు లేవని స్పష్టం చేశారు. తాను నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నానని.. వారిని పోషించుకోవడానికి తన కాళ్లపై తాను నిలబడిగలిగే ఏ పని అయినా చేస్తానని చెప్పారు.
అయితే యోగా సాధన వల్ల కేవలం ఒక్క పూట మాత్రమే తింటున్నట్లు ఐశ్వర్య భాస్కరన్ వెల్లడించారు. తనను నటిగా చేసింది సీరియల్స్ మాత్రమేనని.. సినిమా తనకు తిండి పెట్టలేదని వివరించారు. ఇప్పుడు తనకు ఒక మంచి టీవీ సీరియల్‌లో అవకాశం వస్తే చాలు అనుకుంటున్నట్లు తెలిపారు. నిజాయితీగా పని చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఐశ్వర్య ఆర్థిక కష్టాలు వింటుంటే ప్రతి ఒక్కరికి కంటనీరు రాకుండా ఉండదు. ప్రస్తుతం ఐశ్వర్య మాటలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమెను ఆదుకోవడానికి కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా సహాయం చేస్తారేమో చూడాలి. న్యాయంగళల్ జయిక్కట్టుం సినిమాతో తమిళ తెరకు పరిచయమై ఐశ్వర్య దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఐశ్వర్య ఎక్కువగా మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలలో నటించి మెప్పించారు. బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి మూవీస్‌లో నటించారు. హీరోయిన్‌గా అవకాశాలు కరవైనా చిన్నచిన్న పాత్రలు చేసిన ఆమె.. పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆ తర్వాత అవి కూడా లేకపోవడంతో కుటుంబ జీవనం కోసం సబ్బులు అమ్ముకుంటున్నట్టు వివరించారు