
ఏడాదికి ఎంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి వస్తున్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసి తమకంటూ ఒక్క ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకుంటారు, అలాంటి హీరోయిన్స్ లో కీర్తి సురేష్ ఒక్కటి, మలయాళం సినిమాల్లో బాలనటిగా కెరీర్ ని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత చదువు పూర్తయి చేసుకొని హీరోయిన్ గా అరంగేట్రం చేసి తెలుగు , తమిళ మరియు మలయాళం బాషలలో ప్రముఖ స్టార్ హీరోలందరి సరసన నటిస్తూ మోస్ట్ కేజ్రీస్ట్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేష్, అందాల ఆరబోతల పాత్రలకు దూరం గా ఉంటూ , కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే పోషిస్తూ తనకంటూ ఒక్క ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకుంది కీర్తి సురేష్, ముఖ్యంగా మహానటి సినిమా లో ఈమె ఎంత అద్భుతమైన నటనని కనబరిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా లో ఆమె అద్భుతమైన నటనకి జాతీయ పురస్కారం కూడా దక్కింది, అలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే నేషనల్ అవార్డు కొట్టిన ఏకైక హీరోయిన్ గా కీర్తి సురేష్ చరిత్రకి ఎక్కింది.
ఇది ఇలా ఉండగా గత కొంత కాలం నుండి కీర్తి సురేష్ ప్రేమాయణం గురించి సోషల్ మీడియా లో రకరకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి, తన అద్భుతమైన సంగీతం తో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక్క ఊపు ఊపేస్తున్న ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవి చంద్రన్ తో కీర్తి సురేష్ ఘాడమైన ప్రేమలో ఉంది అని,ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారు అని, త్వరలోనే వీళ్లిద్దరి పెళ్ళికి సంబంధించిన వార్త అధికారికంగా తెలియచేయనున్నారు అని కోలీవుడ్ మొత్తం కోడై కూస్తుంది, ఈ వార్తల పై అటు కీర్తి సురేష్ కానీ ఇటు అనిరుద్ కానీ ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం తో ప్రచారం అవుతున్న ఈ వార్తలు గాసిప్స్ కాదు అని, నిజమే అని వీళ్లిద్దరి అభిమానులు అనుకుంటున్నారు, అనిరుద్ కి ఇలాంటివి కొత్త ఏమి కాదు అనేది వాస్తవం, ఈయన కోలీవుడ్ చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత బ్రేక్ అప్ అయిపోయాడు, ఇప్పుడు తాజాగా ఆయన కీర్తి సురేష్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు, కనీసం ఈమెతోనైనా ఆయన లాంగ్ రిలేషన్ షిప్ కొనసాగిస్తూ పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.
ఇక కీర్తి సురేష్ ప్రస్తుతం అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కేజ్రీ ప్రాజెక్ట్స్ చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది, ఈమె టాలీవుడ్ లో నితిన్ తో కలిసి నటించిన రంగదే సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, ఈ సినిమా సమ్మర్ కానుకగా మార్చి 26 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది,ఇక ఈ సినిమాతో పాటు ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది, వీటితో తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటిస్తున్న అన్నతే అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది, ఈ సినిమాలో ఆమెతోపాటు నయనతార కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది, టాలీవుడ్ లో గోపీచంద్ తో శంఖం, శౌర్యం వంటి సినిమాలు తీసిన శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు, త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతుంది, ఇలా ఈమె వరుసగా సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ లో పీక్స్ స్టేజి ని అనుభవిస్తుంది.