Home Entertainment సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయిన మహేష్ – త్రివిక్రమ్ మూవీ

సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయిన మహేష్ – త్రివిక్రమ్ మూవీ

0 second read
0
0
1,800

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీదున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే అని చెప్పొచ్చు..బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ వంటి డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత మహేష్ బాబు చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకి దూసుకుపోతున్నాడు..ఆ సినిమా తర్వాత ఆయన చేసిన నాలుగు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా సూపర్ హిట్ గా నిలిచాయి..ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాకి అయితే యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కామేంరుష గా పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను సాధించింది..ఇలా మంచి ఊపు మీద దూసుకుపోతున్న మహేష్ బాబు తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్నానని అధికారికంగా ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి..పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా , భీమ్లా నాయక్ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు..ఇక్కడి వరుకు అంత బాగానే ఉన్నా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు మహేష్ బాబు అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందంటూ ఫిల్మ్ నగర్ నగర్ లో ఒక్క వార్త తెగ చక్కర్లు కొడుతోంది..త్రివిక్రమ్ స్టోరీ లైన్ చెప్పగానే ఎంతగానో నచ్చిన మహేష్ వెంటనే సినిమా చేద్దాం ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకొని రా అని చెప్పాడు..సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ని ఇటీవలే కలిసి ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ని వినిపించాడట త్రివిక్రమ్..స్క్రిప్ట్ మొత్తాన్ని విన్న తర్వాత మహేష్ బాబు సంతృప్తి గా లేనట్టు సమాచారం..స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేసుకొని రావాలని..అప్పుడే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిద్దాం అని త్రివిక్రమ్ కి చెప్పాడట మహేష్..దీనితో త్రివిక్రమ్ ఈగో బాగా హిర్ట్ అయినట్టు సమాచారం..సినిమా అయితే కమిట్ అయ్యాడు కాబట్టి స్క్రిప్ట్ లో మార్పులు అయితే చేస్తున్నాడట త్రివిక్రమ్ శ్రీనివాస్..మార్పులు చేసిన తర్వాత కూడా మహేష్ కి నచ్చకపోతే ప్రాజెక్ట్ ని ఆపేయాలని ఉద్దేశ్యం తో త్రివిక్రమ్ ఉన్నట్టు తెలుస్తుంది.

గతం లో కూడా మహేష్ బాబు సుకుమార్ తో చెయ్యాల్సిన సినిమా ఇలాగె క్రియేటివ్ డిఫరెన్స్ రావడం వల్ల ఆపేయాల్సి వచ్చింది..ఆ సినిమానే పుష్ప అని అంటూ ఉంటారు..ఇప్పుడు త్రివిక్రమ్ తో చెయ్యబొయ్యే సినిమా కూడా అలాగే ఆపేయనున్నాడా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి..మరి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్తుందో లేదో చూడాలి..గతం లో త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా టీవీ లో వచ్చినప్పుడు మాత్రం పెద్ద హిట్ అయ్యాయి..ఈ రెండు సినిమాలను ఇప్పుడు టీవీ లో వేసిన కూడా ఆడియన్స్ ఎగబడి చూస్తారు..అంతటి క్రేజ్ ని ఈ రెండు సినిమాలు దక్కించుకున్నాయి..అందుకే మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అభిమానుల్లోనూ మరియు ఆడియన్స్ లోను అంత క్రేజ్..కానీ ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకముందు నుండే ఈ సినిమా అత్తికెక్కింది అనే వార్తలు ఇప్పుడు అభిమానులను కంగారు పెడుతుంది..ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందొ అతి త్వరలోనే తెలియనున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…