
ఈ మధ్య కాలం లో టాప్ సెలెబ్రెటీలకు కూడా రక్షణ లేకుండా పోయింది.సామాన్యులకు ఎలాగో దొంగల నుండి దాడులు తప్పవు.కానీ పటిష్టమైన సెక్యూరిటీ పెట్టుకున్న సెలెబ్రెటీలకు కూడా రక్షణ లేకపోవడం అనేది దురదృష్టకరం.ఇది వరకే ఎంతో మంది ప్రముఖ సెలెబ్రిటీల ఇళ్లల్లోకి దొంగలు చొరబడి దోపిడీ చేసుకున్న ఘటనలు జరిగాయి.ఇప్పుడు ఏకంగా తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో దొంగతనం జరిగిందట.
ఈ మేరకు ఆమె చెన్నై తేనాంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఐశ్వర్య ఇంట్లో ఉండే లాకర్ లో వజ్రాలు మరియు అరం నెక్లెస్ తో పాటుగా 60 సవర్ల గాజులు కనిపించకుండా పోయాయని ఈ సందర్భంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.వాటి విలువ లక్షల్లోనే ఉంటుందట.తన ఇంట్లో పనిచేసే ముగ్గురు మీద అనుమానం ఉందని, వాళ్ళే ఈ పనికి పాల్పడి ఉంటారని ఈ సందర్భంగా ఐశ్వర్య చెప్పుకొచ్చింది.2019 వ సంవత్సరం లో తన చెల్లెలు సౌందర్య పెళ్లి కోసం గా ఈ నగలు ఆమెకి ఉపయోగించిందని, ఆ తర్వాత ఈ లాకర్ లోనే దాచిపెట్టాను అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.
సెయింట్ మోరిస్ రోడ్డు వద్ద ఉన్న తన అపార్ట్మెంట్ లో 2021 వ సంవత్సరం ఆగష్టు నెల వరకు ఉంచానని, తన మాజీ భర్త ధనుష్ తో కలిసి ఉన్నప్పుడు ఆ అపార్ట్మెంట్స్ కి మార్చనని, ఆ తర్వాత 2022 వ సంవత్సరం లో తన తండ్రి రజినీకాంత్ ఇంటికి షిఫ్ట్ చేసానని చెప్పుకొచ్చింది.ఆ లాకర్ కి సంబంధించిన తాళాలు ఆ అపార్ట్మెంట్స్ లోనే ఉంటాయని, అది కేవలం తన దగ్గర పని చేసే ఆ ముగ్గురు దగ్గరే ఉంటుందని, తీసి ఉంటే వాళ్ళే తీసి ఉండాలంటూ ఈ సందర్భంగా ఆమె కంప్లైంట్ లో చెప్పుకొచ్చింది.నిర్మాతగా మరియు దర్శకురాలిగా దూసుకుపోతున్న ఐశ్వర్య కి ఇలాంటి సంఘటన ఎదురవ్వడం నిజంగా దురదృష్టకరం.