Home Entertainment సూపర్ స్టార్ రజినికాంత్ ని కూడా దాటేసిన నిఖిల్..ఇది మాములు మాస్ కాదు

సూపర్ స్టార్ రజినికాంత్ ని కూడా దాటేసిన నిఖిల్..ఇది మాములు మాస్ కాదు

6 second read
0
0
263

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తీకేయ 2 వసూళ్ల పరంగా భారీ స్థాయిలో దూసుకుపోతోంది. ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. బాలీవుడ్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిన చోట టాలీవుడ్ ఈ మూవీ ఈ స్థాయిలో హిట్ అవ్వడంపై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. నాలుగో వారంలో కూడా ఈ మూవీ మంచి వసూళ్లు సాధిస్తూ భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.110 కోట్ల గ్రాస్ దాటిన ఈ మూవీ రూ.50 కోట్ల లాభాలను కళ్లజూసింది. అంతేకాకుండా హిందీలోనూ సౌత్ చిత్రాలలో టాప్ గ్రాసర్‌గా కార్తీకేయ-2 నిలిచింది. హిందీలో రజనీకాంత్ కబాలి మూవీ వసూళ్లను కూడా దాటేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. నాలుగు వారాలకు ఈ మూవీ హిందీ బెల్ట్‌లో రూ30 కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. తద్వారా టాప్-10 జాబితాలో నిలిచింది.

హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ చిత్రాలలో బాహుబలి-2 టాప్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా బాలీవుడ్ మార్కెట్‌లో రూ.512 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత కేజీఎఫ్-2 రూ.434 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్.ఆర్.ఆర్ మూవీ రూ.277కోట్లు, రోబో-2 రూ.188కోట్లు, బాహుబలి-1 రూ.120 కోట్లు, పుష్ప రూ.106కోట్లు , కేజీఎఫ్-1 రూ.44 కోట్లు సాధించి టాప్-10లో కొనసాగుతున్నాయి. అయితే యష్ రికార్డును నిఖిల్ బీట్ చేస్తాడో లేదో మరికొన్ని రోజులు ఆగితే తేలిపోతుంది. ప్రస్తుతం హిందీలో వెయ్యికి పైగా లొకేషన్‌లలో 2,500 షోలకు పైగా కార్తీకేయ-2 ప్రదర్శింపబడుతోంది. బలమైన కథ, అదిరిపోయే విజువల్స్, స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వారం బాలీవుడ్‌లో బ్రహ్మాస్త సినిమా భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ మూవీ కూడా సోషియో ఫాంటసీ కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి.

బ్రహ్మాస్త కారణంగా కార్తీకేయ మూవీ బాలీవుడ్‌లో కొంచెం డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ నటించిన బ్రహ్మాస్త మూవీకి సరైన టాక్ రాకపోతే నిఖిల్ మూవీకి ఇది ప్లస్ పాయింట్ అవుతుంది. అటు అమెరికాలోనూ ఈ చిత్రం క్రేజ్ జోరుగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ కార్తికేయ-2 మూవీ 1.5 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. ఇంకా జోరు కొనసాగుతూనే ఉంది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్‏లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీనివాస్‌రెడ్డి, వైవా హర్ష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాను దాదాపు 50 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…