Home Entertainment సూపర్ స్టార్ కృష్ణ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్సైన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా?

సూపర్ స్టార్ కృష్ణ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్సైన సూపర్ హిట్ సినిమా ఏమిటో తెలుసా?

0 second read
0
1
1,704

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణ వార్త విని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఇండస్ట్రీ కి మూలస్తంభంగా మారి ఇండస్ట్రీ కి ఎన్నో సేవలు అంధించిన కృష్ణ గారు నిండు నూరేళ్లు జీవించాలని అభిమానులు ప్రార్థించారు..ఆయన శారీరకంగా కూడా ఈ వయసులో ఆరోగ్యంగానే ఉండేవారు..కానీ తనకి ఎంతో ఇష్టమైన కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా తనని వదిలి వెళ్లిపోతుండడం తో మానసికంగా ఎంతో కృంగిపోయారు..దానితో ఆయన ఆరోగ్యం దెబ్బతింటూ వచ్చింది..కానీ స్వతహాగా ఎంతో గుండె ధైర్యంగల కృష్ణ గారు వాటిని అధిగమించి జీవించాలనుకున్నారు..కానీ ఆయనకీ గుండెపోటు వస్తుందని మాత్రం ఎవ్వరు ఊహించలేకపోయారు..హాస్పిటల్ లో చేరిన తర్వాత కూడా ఆయన బ్రతుకుతారు..సురక్షితంగా బయటపడతారు అని అనుకున్నారు..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కృష్ణ గారి అభిమానులు దేవుడికి ప్రార్థనలు కూడా చేసారు..కానీ ఆ ప్రధానాలేవి కూడా కృష్ణ గారి ప్రాణాలకు కాపాడలేకపోయాయి..ఈరోజు ఫిలిం నగర్ లోని మహా ప్రస్థానం లో మధ్యాహ్నం లో ఆయన అంత్యక్రియలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి నట ప్రస్థానం గురించి అందరికి తెలిసిందే..ఆయన ఒక తెరిచిన పుస్తకం లాంటివాడు..తన తుదిశ్వాస వరుకు ఇండస్ట్రీ లో నటుస్తునే ఉండాలనుకున్నారు..కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన 2016 వ సంవత్సరం శ్రీ శ్రీ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు..అయితే కృష్ణ గారు మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరో పాత్రలకు దూరమై ప్రత్యేకమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు..ఆయన స్టార్ హీరో గా కొనసాగుతున్న సమయం లో కూడా తన తోటి స్టార్ హీరోలందరితో కలిసి మల్టీస్టార్ర్ర్ , సినిమాలు చేసాడు..ఎన్టీఆర్ , నాగేశ్వరరావు,శోభన్ బాబు, కృష్ణం రాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన కృష్ణ ఈ తరం స్టార్ హీరోలలో తన కొడుకు మహేష్ తో తప్ప మరో హీరోతో నటించలేదు..అయితే గతం లో ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం వచ్చింది.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో క్లాసిక్ గా పిలవబడే సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించిన రఘువరన్ పాత్రకి తొలుత శోభన్ బాబు గారిని అడిగారు..అప్పటికే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసిన శోభన్ బాబు ఆ పాత్రలో నటించడానికి ఒప్పుకుకొలేదు..ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారిని అడిగారు..ఆయన ఈ చిత్రం లో నటించడానికి తొలుత ఒప్పుకున్నారు కానీ షూటింగ్ అనుకున్న సమయం లో ప్రారంభం అవ్వకపోవడం తో కృష్ణ గారు డేట్స్ ని సర్దుబాటు చేయలేకపోయారు..దీనితో ఈ సినిమా నుండి కృష్ణ గారు తప్పుకోవాల్సి వచ్చింది..అలా పవన్ కళ్యాణ్ – కృష్ణ గారి కాంబినేషన్ మిస్ అయ్యింది..గతం లో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారితో కృష్ణ గారు మూడు సినిమాలు చేసాడు..వాటిల్లో తోడు దొంగలు అనే సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రాలేదు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…