
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ట్రెండ్ సెట్టర్..కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి పర్యాయపదం లాంటి హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం తీవ్రమైన అనారోగ్యం రావడం తో హైదరాబాద్ లో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు..చాలా కాలం నుండి సూపర్ స్టార్ కృష్ణ గారు ఊపిరి తిత్తులలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతూ వస్తున్నారు..ఈరోజు ఉదయం మరింత తీవ్రమైన ఇబ్బందికి గురి చెయ్యడం తో ఆయనని హాస్పిటల్ కి తరలించారు..79 ఏళ్ళ వయసున్న సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ వయసులో చూడకూడనివి చూసేసారు..తనలో సగభాగమైన విజయ నిర్మల గారు చనిపోవడం ఆయనని మానసికంగా తీవ్రంగా కృంగిపోయేలా చేసింది..ఆ తర్వాత ఈ ఏడాది ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు చనిపోవడం..ఈమధ్య కాలం లో ఆయన సతీమణి ఇందిరా దేవి గారు చనిపోవడం వంటివి కృష్ణ గారు తట్టుకోలేకపోయారు.
అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ గారి ఆరోగ్యం నిలకడగా ఉందని..అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మహేష్ బాబు టీం అధికారిక ప్రకటన చెయ్యడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు..కృష్ణ గారికి వయసు మీదకి వచ్చినప్పటికీ కూడా ఆరోగ్యం విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ రావడం ఆయనకీ అలవాటు..ఈ వయసులో కూడా ఆయన యోగ మరియు వ్యాయామం వంటివి చేస్తాడు..అందుకే ఇది వరుకు ఆయనకీ ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురు అవ్వలేదు..కానీ ఒక్కసారిగా ఉదయం నిద్రలేవగానే కృష్ణ గారికి తీవ్ర అనారోగ్యం అని వార్త రావడం తో అభిమానులు తీవ్రమైన ఆందోళనకి గురైయ్యారు..మహేష్ బాబు గారికి కృష్ణ అంటే ఎంత అభిమానమో మన అందరికి తెలిసిందే..ఆయనకీ జరగరానిది ఏమైనా జరిగితే మహేష్ బాబు అసలు తట్టుకోగలడా అని అభిమానులు ఆందోళన చెందారు..కానీ భయపడాల్సిన అవసరం ఏమి లేదని వార్త రావడం తో వాళ్లకి కాస్త ఉపశమనం దొరికింది.
సూపర్ స్టార్ కృష్ణ గారు తనకి ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా సినిమాల్లో బిజీ గా ఉండాలనే కోరుకునేవాడు..అందుకే 2016 వరుకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు..కానీ ఆ తర్వాత ఆరోగ్య సమస్యలు కారణంగా డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు సినిమాల్లో నటించడం మానేశారు కృష్ణ గారు..ఆయనకీ సంబంధించిన అన్ని కార్యక్రమాలను విజయ నిర్మల గారు అప్పట్లో చూసుకునేవారు..కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుమారుడు నరేష్ గారే ఇప్పుడు కృష్ణ గారి బాగోగులు చూసుకుంటున్నారు..ఇప్పటికి కూడా ఆయన లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వూస్ లో చలాకీగానే కనిపించారు..కాబట్టి కృష్ణ గారి ఆరోగ్యం పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆయనకీ అభిమానులకు భరోసా ఇస్తున్నారు కృష్ణ గారి సన్నిహిత వర్గాలు..ఆయనకీ సంపూర్ణ ఆయుష్యు ఇచ్చి ఆ దేవుడు ఆయనని నిండు నూరేళ్ళ చల్లగా ఉంచాలని మనమందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడికి ప్రార్థనలు చేద్దాము.