
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎలాంటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు టాప్ రేంజ్‌కు చేరుకున్నారు. వీరిలో సుడిగాలి సుధీర్ కూడా ఒకడు. అతడు చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు. భారీ స్థాయిలో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఈ షో నిర్మాణ సంస్థ మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సుడిగాలి సుధీర్‌కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ముఖ్యంగా రష్మీతో సుధీర్ కెమిస్ట్రీ అదుర్స్ అని చెప్పుకునేలా పలు షోలను రూపొందించింది. జబర్దస్త్ షోకే కాకుండా ఢీ షోకు కూడా సుడిగాలి సుధీర్‌ను మల్లెమాల సంస్థ యాంకరింగ్‌ను చేసింది. మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా సుధీర్ కీలకంగా వ్యవహరించాడు. అయితే ఉన్నట్లుండి సుధీర్ మల్లెమాల సంస్థ నుంచి తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతోనే సుధీర్ ఈ పని చేశాడంటూ చాలా మంది చెప్పుకున్నారు.
అయితే అసలు కారణాలను విశ్లేషిస్తే సుధీర్ తప్పుకోవడం కాదని… మల్లెమాల సంస్థ కావాలనే సుధీర్‌ను సైడ్ చేసిందనే కామెంట్స్ తాజాగా వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా మూడు షోల నుంచి తప్పుకోవడం మాములు విషయం కాదని.. సుధీర్ ఇలాంటి డెసిషన్ తీసుకునే ప్రసక్తే లేదని చాలా మంది అనుమానించారు. తాజాగా చలాకీ చంటి ఈ విషయంపై స్పందించాడు. అయితే అతడు అస్పష్టంగా కొన్ని విషయాలు వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సుడిగాలి సుధీర్ చేసిన రెండు తప్పులు మల్లెమాల సంస్థకు దూరం అయ్యేలా చేశాయని తాను భావిస్తున్నట్లు చలాకీ చంటి చెప్పుకొచ్చాడు. మనకు గుర్తింపు ఇచ్చిన సంస్థ పట్ల గౌరవంతో ఉండాలన్నాడు. మూడు సార్లు తాను జబర్దస్త్ నుండి బయటకు పోయి తిరిగి వచ్చినట్లు గుర్తుచేశాడు. తాను ఎప్పుడు బయటకు వెళ్లినా సహేతుకమైన కారణంతోనే వెళ్లానని.. సంస్థకు మనం ఎంత లాయల్‌గా ఉన్నామో చాలా ముఖ్యమని, ఎలాంటి రిలేషన్ కలిగి ఉన్నామన్నది కూడా పరిగణనలోకి తీసుకుంటారని చలాకీ చంటి అన్నాడు.
తాను కొన్ని అనివార్య కారణాల వల్ల జబర్దస్త్ షోను వదిలేసినా వేరే ఛానల్‌కు వెళ్లలేదని.. ఇతర షోలలో పాల్గొనలేదని చలాకీ చంటి తెలిపాడు. అందుకే తాను తిరిగి వచ్చినా అవకాశం ఇచ్చారని చెప్పాడు. ఈటీవీ షోలను వదిలేసి ఇతర ఛానళ్లలో షోస్ చేయడం సుడిగాలి సుధీర్‌ను మల్లెమాల దూరం పెట్టడానికి కారణమని చంటి పరోక్షంగా చెప్పాడు. కాగా మ్యాజిక్‌లు చేసుకుంటూ కెరీర్‌ను మొదలు పెట్టిన సుధీర్.. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో ఆరంభంలోనే తనదైన శైలిలో మెప్పించిన అతడు.. ఆ తర్వాత కొద్ది రోజులకే టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తున్నాడు. అంతేకాదు, రష్మీతో లవ్ ట్రాక్‌తో మరింత పాపులర్ అయిపోయాడు. బుల్లితెరపై తనదైన టాలెంట్ చూపించడంతో సినిమాల్లోనూ సుధీర్‌కు అవకాశాలు వచ్చాయి. అలా సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీమంకీస్ వంటి సినిమాల్లో నటించాడు. కానీ ఈ సినిమాలు అతడికి హిట్ మాత్రం తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు సుధీర్ కాలింగ్ సహస్ర, గాలోడు వంటి సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలైనా సుధీర్ కెరీర్‌కు ఉపయోగపడతాయో.. లేదో వేచి చూడాలి.