
బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా తన అందం తో అభినయం ఇప్పటికి రాణిస్తున్న హీరోయిన్ మీనా..ఒకానొక్క సమయం లో తెలుగు , తమిళం , మలయాళం బాషలలో మీనా కోసం స్టార్ హీరోలందరూ క్యూ కట్టేవారు..దశాబ్దానికి పైగా ఆమె హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది..ప్రస్తుతం ఆమె సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే కాకుండా క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తుంది..కెరీర్ పీక్ స్టేజి లో నడుస్తున్న సమయంలోనే బెంగళూరు లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న విద్యాసాగర్ ని పెళ్లి చేసుకుంది మీనా..ఈ దంపతులిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు..అయితే మీనా భర్త కొద్దీ నెలల క్రితమే అనారోగ్యంగా ప్రాణాలను వదిలిన సంఘటన మన అందరికి తెలిసిందే..అప్పట్లో మీనా గారి పరిస్థితి చూసి నెటిజెన్స్ ఎంతగానో బాధపడ్డారు..అయితే ఇప్పుడు మీనా రెండవ పెళ్లి చేసుకోబోతుందంటూ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త అందరిని షాక్ కి గురి చేసింది.
మీనాకి రెండవ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా ఇంట్లో వాళ్ళు నీకోసం కాకపోయినా పిల్లల కోసం చేసుకోమని తెగ ఫోర్స్ చేస్తున్నారట..తమిళ ఇండస్ట్రీ కి చెందిన ఒక సీనియర్ నటుడు మీనా కుటుంబానికి బాగా దగ్గరైన మనిషి..అతనంటే పిల్లలిద్దరికీ కూడా బాగా ఇష్టమట..అందుకే అతనితో మీనాకి రెండవ పెళ్లి చెయ్యడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారట..ఇందుకు మీనా అంగీకారం తెలుపుతుందో లేదో తెలీదు..మరోపక్క తన రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఇంతలా ప్రచారం అవుతున్న కూడా మీనా నోరు మెదపకపోవడం గమనార్హం..తన భర్త చనిపోయినప్పుడు వీళ్లిద్దరి దాంపత్య జీవితం గురించి సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వచ్చాయి..దానికి మీనా వెంటనే స్పందించి రెస్పాన్స్ ఇచ్చింది..తప్పుడు వార్తలు ప్రచారం చెయ్యొద్దు అంటూ సోషల్ మీడియా ముఖంగా వేడుకుంది..బాధలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియా లో తప్పుడు వార్తలపై స్పందించిన మీనా..తన రెండవ పెళ్లి గురించి ఇంతలా ప్రచారం జరుగుతున్నా నోరు మెదపకపోవడాన్ని చూస్తుంటే ఆమె నిజంగానే రెండవ పెళ్లి చేసుకోబోతుందా అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
ప్రస్తుతం మీనా కెరీర్ కూడా ముగింపు దశకి చేరుకుంది..ఆమె చేతిలో కేవలం రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి..ఇక ఆమె కూతురు నైనికా బాలనటిగా తమిళం లో పలు సినిమాల్లో నటించింది..అందులో విజయ్ హీరో గా నటించిన ‘తేరి’ సినిమాలో నైనికా విజయ్ కి కూతురు గా నటించింది..ప్రస్తుతం ఆమె చదువుకుంటుంది..ఆమె హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగుపెట్టడానికి చాలా సమయమే ఉంది..అప్పటి వరుకు కుటుంబం నడవాలంటే కచ్చితంగా ఒక తోడు కావాలి..అందుకే మీనా రెండవ పెళ్లి గురించి కూడా ఆలోచించడం మొదలు పెట్టినట్టు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి..ఇందులో ఎంత మాత్రం నిజం తెలీదు కానీ ఒకవేళ మీనా పిల్లల కోసం రెండవ పెళ్లి చేసుకున్నా ఏ మాత్రం తప్పులేదని నెటిజెన్స్ అంటున్నారు..మగవాళ్ళు భార్య చనిపోతే రెండవ పెళ్లి చేసుకోవట్లేదా..అలాంటిది భార్య ఎందుకు చేసుకోకూడదు..చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదంటూ నెటిజెన్స్ నుండి మీనా కి సపోర్టు కూడా గట్టిగానే వస్తుంది.