
ఇటీవల కాలం లో ఇండస్ట్రీ కి మంచి ఊపు ఇచ్చే రేంజ్ హిట్ కొట్టిన సినిమాలలో ఒకటి సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్ పై అశ్వనీదత్ మరియు ఆయన కుమార్తె స్వప్న సంయుక్తంగా నిర్మించారు..ఈ సినిమా ద్వారానే మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది..ప్రముఖ స్టార్ హీరోయిన్ రష్మిక ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది..హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండి కల్ట్ క్లాసిక్ అనే రేంజ్ లో టాక్ తెచ్చుకుంది..లీడ్ పెయిర్ ఇద్దరికీ కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది..ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా ఎవ్వరు ఊహించని రేంజ్ లో వచ్చింది..మౌత్ టాక్ అద్భుతంగా రావడం తో ఈ సినిమాకి రోజు రోజుకి కలెక్షన్స్ పెరుగుతూ సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని అందుకునే దిశగా ముందుకి పోతుంది.
ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది..మొదటి రోజు కేవలం 3 కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా కేవలం మూడు రోజులకే 11 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది..వీక్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లను సొంతం చేసుకుంటున్న ఈ సినిమా వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిలు షేర్ వసూలు చేసే దిశగా అడుగులు వేస్తుంది ఈ చిత్రం..ఈ సినిమా తెలుగు డిజిటల్ + సాటిలైట్ రైట్స్ దాదాపుగా 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు సమాచారం..మొత్తం మీద థియేట్రికల్ మరియు డిజిటల్ + సాటిలైట్ రైట్స్ కలిపి దాదాపుగా 60 కోట్ల రూపాయిల బిజినెస్ ని జరుపుకుంది..కేవలం 17 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా కి 40 కోట్ల రూపాయలకు పైగానే లాభాలు రావడం విశేషం..ఈ లాభాలతో మరో రెండు సీత రామం వంటి సినిమాలు తియ్యొచ్చు అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
హను రాఘవపూడి గత సినిమాలు చూస్తే ఇతనిలో మంచి టాలెంట్ ఉంది..కానీ సమయం కలిసిరాక సరైన హిట్ పడలేదు అని అనుకునేవాళ్లు అందరూ..ఇప్పుడు ఆ సమయం సందర్భం కలిసి వచ్చి ఇండస్ట్రీ లోనే కల్ట్ క్లాసిక్ అనిపించే రేంజ్ హిట్ ని కొట్టారు..ఒక తొలిప్రేమ..ఒక గీతాంజలి..ఒక సీతారామం అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..ఇటీవల కాలం లో ఈ రేంజ్ టాక్ ఏ సినిమాకి కూడా రాలేదు..ముఖ్యంగా వీక్ డేస్ లో ఈ సినిమా సిటీస్ లో చేస్తున్న వసూళ్లు చూస్తుంటే ఈ సినిమా రన్ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు..ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి వీక్ డేస్ లో వస్తున్నా వసూళ్లు ఇటీవల కాలం లో విడుదలైన పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు సినిమాలకు కూడా రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ప్రస్తుతానికి అయితే ఈ సినిమా ౩౦ కోట్ల రూపాయిల వసూళ్లను రాబడుతుంది అని అంచనా వేస్తున్నారు..కానీ ఫ్లో చూస్తుంటే 40 కోట్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.