
ఇటీవల కాలం లో టాలీవుడ్ ఇండస్ట్రీ ని దున్నేసిన సినిమాలో ఒకటి సీతారామం..వరుస ఫ్లాప్స్ రథో డీలాపడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఆదుకున్న సినిమాలలో ఇది కూడా ఒకటి..హను రాఘవపూడి దర్శకత్వం లో..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎవ్వరు ఊహించని రీతిలో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి దుల్కర్ సల్మాన్ కి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ రప్పించిన సినిమాగా నిలిచింది..ఇక పై టాలీవుడ్ లో దుల్కర్ సల్మాన్ నుండి విడుదలయ్యే ప్రతి సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..యూత్ ని ఆ రేంజ్ లో ఆయన ఆకట్టుకున్నాడు..వైజయంతి మూవీ బ్యానర్ మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ దాదాపుగా 17 కోట్ల రూపాయలకు జరిగింది..ఇప్పుడు ఈ సినిమా క్లోసింగ్ కి దగ్గరగా రావడం తో ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఈ సినిమా తో పోటీ గా నందమూరి కళ్యాణ్ రామ్ భింబిసారా కూడా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..రెండు సినిమాలు కూడా బంపర్ హిట్టే..కానీ లాంగ్ రన్ లో మాత్రం సీత రామం ది పై చెయ్యి అని చెప్పక తప్పదు..భింబిసారా అంటే ఆ సినిమాలో నందమూరి హీరో..టాక్ వస్తే కచ్చితంగా ఓపెనింగ్స్ అదిరిపోతాయి..క్లోసింగ్ కలెక్షన్స్ కూడా అదిరిపోతాయి..కానీ ఇక్కడ దుల్కర్ సల్మాన్ అంటే టాలీవుడ్ ఆడియన్స్ ఎవ్వరికి కూడా సరిగా తెలియదు..అలా ముక్కు మొహం తెలియకపోయిన కూడా అతని సినిమాకి ఎగబడి చూశారంటే మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంత గొప్పవారు అనేది అర్థం చేసుకోవచ్చు..కేవలం రెండు కోట్ల రూపాయిల ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఫుల్ రన్ లో 35 కోట్ల రూపాయిల షేర్ మరియు 75 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేయండి అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..అవతల కొంతమంది ప్రముఖ స్టార్ నిర్మాతల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడేసరికి షూటింగ్స్ అన్ని ఆపివేసి సమ్మె జరుపుతున్న సమయం లో వారికి కనువిప్పు కలిగిస్తూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ నంబర్స్ తో చెప్పిన సమాధానం ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు.
కేవలం బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రమే కాదు..సినిమా పరంగా కూడా ఈ చిత్రం ఒక కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీ గా నిలిచింది..అమెరికాలో కూడా ఈ సినిమా ప్రభంజనమే సృష్టించింది..ఇక్కడ ఈ సినిమా దాదాపుగా 14 లక్షల డాలర్లు వసూలు చేసి ఈ ఏడాది #RRR,భీమ్లా నాయక్ ,సర్కారు వారి పాట సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..అలా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఈరోజు బయ్యర్లకు దాదాపుగా 17 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టిందంటే మాములు విషయం కాదు..అంటే పెట్టిన ప్రతి రూపాయికి రెండు రూపాయిలు వసూలు చేసింది అన్నమాట..మన టాలీవుడ్ కి ప్రస్తుతం ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలి..ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా అలానే ఉన్నాయి..భింబిసారా , సీతారామం మరియు కార్తికేయ 2 వంటి చిత్రాలు కేవలం బ్లాక్ బస్టర్ హిట్స్ అంటే సరిపోదు..డబుల్ బ్లాక్ బస్టర్ హిట్స్ అని అనాలంటున్నారు ట్రేడ్ పండితులు.