
చాలా కాలం నుండి వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కొత్త ఊరట ని ఇచ్చిన సినిమాలు భింబిసారా మరియు సీతారామం..మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తే నెత్తిన పెట్టుకొని ఆరాధిస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా నిలిచినా సినిమాలు ఇవి..నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకి టాక్ వస్తే మంచి వసూళ్లు రావడం పెద్ద విషయం కాదు..ఎందుకంటే కళ్యాణ్ రామ్ మన అందరికి తెలుసు..నందమూరి ఫామిలీ వంటి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరో కాబట్టి ఆయన సినిమాకి వసూళ్లు రావడం లో పెద్ద ఆశ్చర్యం లేదు..కానీ మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ పేరు ఇక్కడి జనాలకు తెలిసి కూడా ఉండదు..అలాంటి ముక్కు మొహం తెలియని హీరో సినిమాకి మంచి టాక్ వస్తే ఇక్కడ అద్భుతమైన ఓపెనింగ్స్ ఇవ్వడమే కాకుండా ఫుల్ రన్ లో కూడా 25 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని ఇచేలా ఉన్నారు మన తెలుగు ఆడియన్స్..ముఖ్యంగా ఓవర్సీస్ తెలుగు ఆడియన్స్ అయితే ఈ సినిమాకి స్టార్ హీరో రేంజ్ వసూళ్లు ఇస్తున్నారు.
మంచి సినిమా ఇస్తే చాలు హీరో ఎవరో కూడా పట్టించుకోము అని అనడానికి ఉదాహరణే ఈ సినిమా..మొదటి రోజు కంటే ఎక్కువగా రెండవ రోజు..రెండవ రోజు కంటే ఎక్కువగా మూడవ రోజు..మూడవ రోజు కంటే ఎక్కువగా నాల్గవ రోజు, ఇలా ప్రతి రోజు ముందు రోజుకంటే మెరుగైన కలెక్షన్స్ ని వసూలు చేసే సినిమాని చూసి మనం చాలా కాలమే అయ్యింది..ఇప్పుడు సీతారామం సినిమాకి జరుగుతుంది చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు..బాక్స్ ఆఫీస్ వద్ద క్లాసికల్ లవ్ స్టోరీ గా సంచలనమైన వసూళ్లను సాధిస్తూ ముందుకి దూసుకుపోతున్న ఈ సినిమా OTT రిలీజ్ గురించి సరికొత్త వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఈ సినిమా OTT హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది..ముందు అనుకున్న డీల్ ప్రకారం ఈ సినిమాని సెప్టెంబర్ రెండవ వారం లో విడుదల చేయబోతున్నారట..తెలుగు , మలయాళం మరియు తమిళ బాషలలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రేక్షకులు OTT కి బాగా అలవాటు పడిన విషయం వాస్తవమే..వాళ్ళని థియేటర్స్ కి రప్పించడం కోసమే హిట్ సినిమాలను తొందరగా కాకుండా 50 రోజుల తర్వాత విడుదల చేస్తున్నారు..ఇప్పుడు సీతా రామం సినిమాని కూడా అలాగే విడుదల చేస్తున్నారు..కానీ OTT కి అలవాటు జనం ఇలా లేట్ గా OTT లో విడుదల చెయ్యడం వాళ్ళ థియేటర్స్ కొంత శాతం మంది రావొచ్చు ఏమో గాని ఎక్కువ శాతం మంది OTT లో చూడడానికే ఇష్టపడుతారు..అలాంటి ఆడియన్స్ సీతారామం OTT రిలీజ్ కోసం మరో నెల రోజులు ఎదురు చూడాల్సిందే..ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది..కేవలం వీకెండ్స్ లో మాత్రమే కాదు..వీక్ డేస్ లో కూడా ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ సంచలనం సృష్టిస్తుంది..ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా 25 నుండి 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేస్తుందని అంచనా..చూడాలిమరి ఈ సినిమా లాంగ్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.