
సిల్క్ స్మిత డిసెంబర్ 2, 1960న తెలుగు కుటుంబంలో జన్మించింది. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వలి గ్రామానికి చెందినవారు. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. కానీ, ఇండస్ట్రీకి వచ్చాక ఆమెను సిల్క్ స్మిత అని పిలిచేవారు. ఈరోజు ఆమె ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ భారతీయ సినిమా చరిత్రలో తన పేరు చిర్తస్థాయి గా నమోదు చేసుకుంది. ఆమెను ‘క్వీన్ ఆఫ్ సెన్సాలిటీ’ అని కూడా అంటారు. సిల్క్ స్మిత వ్యక్తిగత జీవితం తన జీవితంలో చాలా రోజుల పేదరికాన్ని చూసింది. నిరుపేద కుటుంబంలో పుట్టినా, ఏదో ఒకటి సాధించాలన్న తపన సినిమా ప్రపంచంలో నిలబెట్టింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో చిన్నతనంలోనే చదువుకు స్వస్తి పలికింది. నాలుగో తరగతిలోనే చదువు మానేసింది సిల్క్ స్మిత. అప్పటికి ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు.
80వ దశకంలో, ఆమె దక్షిణాది చలనచిత్ర రంగంలో ఆధిపత్యం చెలాయించింది. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం తహతహలాడేవారు. రిలీజ్ కాని సినిమాల నిర్మాతలు ఒక్క పాట కూడా పాడొద్దు అంటూ సిల్క్ స్మిత వెంటపడేవారు. ఆమె కళ్లతో ఒక్క ఎక్స్ ప్రెషన్ ఇస్తే చాలు.. అబ్బాయిలను క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే. అయితే 36 ఏళ్ల వయసులో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. ఐతే ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని ఇప్పటికి కూడా వాదించే వాళ్లు ఉన్నారు. ఐతే ఆమె ఆత్మహత్య కి అసలు కారణం ప్రేమ అని కొందరు చెప్తూ ఉంటారు. ప్రేమ విఫలం అవడంతో మద్యానికి బానిస అయింది అని ఆ మద్యం అతిగా తాగడం వల్ల కృంగిపోయి చనిపోయింది అని అంటూ ఉంటారు.
గత ఇంటర్వ్యూలలో, సిల్క్ స్మిత చనిపోయే ముందు సాయంత్రం చాలా కాల్స్ చేసిందని పలువురు చెప్పారు. తెలుగు నటి అనురాధ, కన్నడ నటుడు రవిచంద్రన్ సహా పలువురు ఇబ్బందులు పడ్డారు. తమ మౌనాన్ని సమర్థించుకున్నారు. బయటకు రాకూడదని ఎంచుకున్న వారి సంఖ్య గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. ఆమె మరణించిన తర్వాత ఒక్క స్మారక సభను కూడా నిర్వహించడంలో సినిమా వాళ్లు విఫలమైంది. మళ్ళీ, ఆమె తన స్వంత కథనాన్ని సినిమాకి ఆధారం చేసుకోవడానికి వెనుకాడలేదు.
సిల్క్ స్మిత మరణవార్త తెలియగానే సినీ ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే ఆమె అంతిమ దర్శనానికి కొద్ది మంది మాత్రమే హాజరుకావడంతో అప్పటి జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు. సిల్క్‌ని చివరిసారిగా సందర్శించిన ఏకైక హీరో అర్జున్. ఎవరూ పట్టించుకోలేదు, అర్జున్ ఒక్కడే రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అని కొందరు విలేకరులు ఆయన్ను స్పష్టంగా ప్రశ్నించారు. రెండ్రోజుల క్రితం అర్జున్‌తో సినిమా షూటింగ్ చివరి రోజున, “నేను చనిపోతే నన్ను చూడటానికి వస్తావా?” అని ఆమె ప్రశ్నించింది. “ఛీ అదేం మాట” పట్టించుకోలేదు కానీ పెద్దగా ఆలోచించలేదు. “ఇప్పుడూ నువ్వు వస్తున్నావు అనుకోని” అన్నప్పుడు, ఈ విషయం గుర్తొచ్చి చిన్నపిల్లాడిలా బాధపడ్డాడు అర్జున్. సీనియర్ జర్నలిస్ట్ తోట భావనారాయణగారి ఈ సమాచారాన్ని అందించారు.