
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వాళ్లు ఉండరు. సచిన్ రిటైర్ అయ్యి పదేళ్లు గడుస్తున్నా ఇంకా ఆయన ఆడుతున్నట్లుగానే ఉంది. సచిన్ షాట్లను, అతడు నెలకొల్పిన రికార్డులను మరిచిపోవడం మన తరం కాదు. అతడి రికార్డులను యువతరం క్రికెటర్లు అందుకుంటారంటే కూడా అనుమానమే. మరోవైపు సచిన్ కామెంటేటర్‌గా సేవలు అందిస్తున్నాడు. అతడికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారన్న సంగతి తెలిసిందే. సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నటన అంటే పిచ్చి. చిన్నప్పుడు తన తండ్రి ఎక్కడ ఆడుతున్నా స్టేడియానికి వచ్చి ఆటను చూసేది. అప్పట్లోనే సారా అందరి దృష్టిని ఆకర్షిస్తూ మీడియాలో కనిపించేది. ప్రస్తుతం ఆమె మరోసారి వార్తల్లో నిలిచింది. లండన్‌లోని ఓ యూనివర్సిటీలో మెడిసిన పూర్తి చేసిన సారా టెండూల్కర్ తన సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఇప్పటికే చాలా పాపులారిటీని సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సారాకు 1.8 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
అటు సారాకు మోడలింగ్ అంటే పిచ్చి. ర్యాంప్ మీద మెరిసి అందరి దృష్టినీ ఆకర్షించింది. సారా చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేది. నటనలో శిక్షణ కూడా తీసుకుంది. కొన్ని బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించిన అనుభవం ఉంది. ఇటీవల బనిత సందూ, తానియా ష్రాఫ్‌లతో కలిసి ఒక యాడ్‌లో కూడా నటించింది. దీంతో ఆమెకు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కూడా పెరుగుతోంది. సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న సారా నిర్ణయానికి తండ్రి సచిన్, తల్లి అంజలి మద్దతు ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో త్వరలో బాలీవుడ్లో ఓ సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొందరు దర్శకులు సారాతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం అందుతోంది. 1997 అక్టోబర్ 12న జన్మించిన సారా టెండుల్కర్ కొన్నేళ్ల క్రితమే బాలీవుడ్ స్టార్ షాహిద్ సరసన సారా అరంగేట్రం చేయనుందనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లేనని అప్పుడు సచిన్ స్పష్టం చేశారు.
గతంలో టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో సారా టెండూల్కర్ లవ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు కూడా నిజం కాదని తెలిసిందే. ఆమె ప్రేమ వార్తలు ఎలా ఉన్నా సారా వెండితెరపై ఎంట్రీ ఇస్తే అభిమానుల మతులు పోగొట్టడం ఖాయం. మరి అందాల భామ తన ఎంట్రీ గురించి త్వరలోనే గుడ్ న్యూస్ ఎనౌన్స్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. కాగా ప్రస్తుతం సారా టెండూల్కర్ సొంతంగా డిజైన్ చేయించిన అంతర్జాతీయ క్లాతింగ్ను ప్రమోట్ చేసుకుంటోంది. సారా క్లాతింగ్ బ్రాండ్స్ ఈ-కామర్స్ ప్లాట్ ఫాం అజియోలో అందుబాటులో ఉంటాయి. మరోవైపు సారా సోదరుడు అర్జున్ టెండూల్కర్ తండ్రి సచిన్‌ను ఫాలో అవుతూ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అతడు ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో ముంబై జట్టు అతడవని బేస్ ప్రైస్ 50 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటివరకు అతడికి ఆడే అవకాశం రాలేదు. అటు ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచ్‌లలో పరాజయం పాలు కావడంతో అర్జున్ టెండూల్కర్‌కు ఇప్పుడైనా తుదిజట్టులో ఆడే అవకాశం ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.