Home Entertainment సినిమాల్లోకి రాకముందు ఫిల్మ్ స్కూల్ లో రామ్ చరణ్ – శ్రియ చేసిన ఒక్క సన్నివేశం చూస్తే ఆశ్చర్యపోతారు

సినిమాల్లోకి రాకముందు ఫిల్మ్ స్కూల్ లో రామ్ చరణ్ – శ్రియ చేసిన ఒక్క సన్నివేశం చూస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
1,137

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌చరణ్ రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్‌ను సాధించాడు. ఆ తర్వాత అతడు నటించిన ఆరెంజ్ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచినా నిరాశపరిచింది. అయితే ఆ ఎఫెక్ట్ కనిపించకుండా నాయక్, రచ్చ, ఎవడు సినిమాలతో వరుస హిట్లను చెర్రీ అందుకున్నాడు. మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ శ్రియ గురించి కూడా అందరికీ తెలుసు. ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అనతికాలంలో అగ్రహీరోల సరసన నటించింది. మెగాస్టార్ చిరంజీవితో ఠాగూర్, బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, నాగార్జునతో సంతోషం, నేనున్నాను, వెంకటేష్‌తో సుభాష్ చంద్రబోస్ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీళ్లతో నటించడానికి ముందే శ్రియ చిరు తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి నటించింది. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా.. కానీ ఇదే నిజం.

రామ్‌చరణ్, శ్రియ ఇద్దరూ ముంబైలోని ఒకే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో కలిసి యాక్టింగ్‌లో శిక్షణ పొందారు.ముంబైలోని కేఎన్‌కే ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చరణ్ సినిమాల కోసం శిక్షణ పొందాడు. ఆ సమయంలో చరణ్ కొన్ని స్కిట్లలో నటించాడు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సదరు వీడియోలో చరణ్ జులపాల జుట్టుతో కళ్లజోడు పెట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ రొమాంటిక్ సీన్‌లో కలిసి చెర్రీ, శ్రియ నటించారు. అయితే అప్పటికే శ్రియ సినిమాల్లో నటిస్తోంది. కేఎన్‌కే ఇనిస్టిట్యూట్‌ను సందర్శించిన సందర్భంగా ఆమె చరణ్‌తో కలిసి ఓ సీన్‌లో నటించేందుకు అంగీకరించింది. చరణ్ కంగారుపడుతూ డైలాగ్ చెప్పినప్పటికీ ఆ సమయానికి అది సూటయ్యింది. పదేళ్ల నాటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. చరణ్ ఇప్పుడు నటనలో ఎంతో రాటుదేలాడు. విచిత్రం ఏంటంటే.. చరణ్, శ్రియ ఇటీవల రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీలో చరణ్‌కు చిన్నతనంలో శ్రియ తల్లిగా నటించింది. చరణ్ తండ్రి పాత్రలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించాడు.

కాగా హీరోయిన్ శ్రియ సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు రెండు ద‌శాబ్దాలు పూర్తయ్యాయి. 2001లో విడుద‌లైన ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. సౌత్‌, బాలీవుడ్‌లోను సినిమాలు చేసి విజ‌యాల్ని అందుకుంది. ర‌ష్యన్ బిజినెస్‌మెన్ ఆండ్రీ కొశ్చీవ్‌ను ప్రేమించిన శ్రియ 2018లో అత‌డిని వివాహం చేసుకుంది. రెండేళ్ల క్రితం పండంటి పాప‌కు జ‌న్మనిచ్చింది. ప్రస్తుతం కుటుంబ బాధ్యతల్ని నిర్వహిస్తూనే మ‌రోవైపు సినీ కెరీర్‌పై ఆమె దృష్టిపెడుతోంది. డిఫ‌రెంట్ క్యారెక్టర్స్ చేస్తోంది. తొమ్మిదేళ్ల త‌ర్వాత క‌న్నడంలో ఆమె ఓ సినిమాను అంగీక‌రించింది. ‘క‌బ్జా’ చిత్రంతో శాండల్‌వుడ్‌లోకి శ్రియ రీఎంట్రీ ఇవ్వబోతుంది. మ‌ధుమ‌తిగా మ‌హారాణి గెట‌ప్‌లో శ్రియ క‌నిపిస్తోంది. ఇండియ‌న్ హిస్టరీలోనే క్రూరుడిగా పేరుపొందిన గ్యాంగ్‌స్టర్ జీవితంతో ఈ సినిమా రూపొందుతోందని శ్రియ తెలిపింది. అటు చరణ్ కూడా శంకర్ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది శంకర్, రామ్‌చరణ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మూవీకి అధికారి అనే టైటిల్ ప్రచారంలో ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

హాలీవుడ్ మూవీ అవతార్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. …