
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి గా నమ్రత శిరోద్కర్ కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మహేష్ బాబు కి ఈమె పరిచయం కాకముందు బాలీవుడ్ లో ఒక్క వెలుగు వెలికిన టాప్ మోస్ట్ హీరోయిన్..ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈమెని భారీ స్థాయి పారితోషికం ఇప్పించి మహేష్ బాబు మూడవ సినిమా వంశి లో నటింపచేసాడు ఆ చిత్ర దర్శకుడు బీ గోపాల్..ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ మహేష్ మరియు నమ్రత మధ్య మంచి స్నేహం ఏర్పడడం..ఆ స్నేహం ప్రేమగా మారి వీళ్లిద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్లకి తెలీకుండా పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..పెళ్లి తర్వాత నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు బిజినెస్ వ్యవహారాలను మరియు కుటుంబ బాధ్యతలను తన భుజాన మోస్తూ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బాయ్ చెప్పేసింది..అయితే గత కొంతకాలం నుండి ఆమె సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అని..బాలీవుడ్ లో ఒక్క ప్రముఖ ప్రొడక్షన్ టీం తో ఆమె చర్చలు కూడా జరిపింది అంటూ వార్తలు
వచ్చాయి.
అయితే ఈ వార్తలపై నమ్రత శిరోద్కర్ స్పందించింది..ఆమె మాట్లాడుతూ ‘ ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను..ఇలాంటి సమయం లో నేను మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాను అంటూ వార్తలు వినిపించాయి..ఇందులో ఎలాంటి నిజం లేదు..ప్రస్తుతానికి అయితే నాకు ఆ ఆలోచన కూడా లేదు..భవిష్యత్తులో కూడా ఉంటుంది అని నేను అనుకోవడం లేదు..ఒకవేళ మహేష్ తన సినిమాలో నటించమని అడిగితె ఆలోచిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోద్కర్..ఈమె బాలీవుడ్ లో దాదాపుగా 50 కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది..ఇక తెలుగు లో మహేష్ బాబు తో వంశి..మరియు మెగాస్టార్ చిరంజీవి తో అంజి సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించింది..వాస్తవానికి ముందుగా ఆమె చిరంజీవి అంజి సినిమానే ముందుగా ఒప్పుకుంది..కానీ ఆ సినిమా షూటింగ్స్ వాయిదా పడుతూ లేట్ అవుతుండడం వల్ల ముందుగా వంశి సినిమానే విడుదల అయ్యింది..ఈ సినిమాలో మహేష్ మరియు నమ్రత తో పాటుగా సూపర్ స్టార్ కృష్ణ కూడా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఆయన హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి యావరేజి గా నిలిచింది..ఈ సినిమా విడుదల అయిన తర్వాత మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి జర్మనీ టూర్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు..జర్మనీ నుండి తిరిగి రాగానే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తియ్యబోయ్యే సినిమాలో నటించబోతున్నాడు..అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ నుండి సినిమా వస్తుంది అనే న్యూస్ వచ్చినప్పటి నుండి ట్రేడ్ అభిమానుల్లో ఎంత అంచనాలు అయితే ఏర్పడ్డాయో..ట్రేడ్ సర్కిల్స్ లో కూడా అదే స్థాయి అంచనాలు నెలకొన్నాయి..పూజ హెగ్డే ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నాడు..ఈ సినిమా పూర్తి అవ్వగానే మహేష్ బాబు రాజమౌళితో తెరకెక్కబోయ్యే సినిమాలో పాల్గొనబోతున్నారు..వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది..అభిమానులతో పాటుగా మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..మరి రాజమౌళి మహేష్ తో ఎలాంటి జానర్ లో సినిమా చెయ్యబోతున్నాడో అనేది చూడాలి.