Home Entertainment సినిమాలు మానేయమంటూ చిరంజీవిని బ్రతిమిలాడుకుంటున్న ఫ్యాన్స్

సినిమాలు మానేయమంటూ చిరంజీవిని బ్రతిమిలాడుకుంటున్న ఫ్యాన్స్

0 second read
0
0
439

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక చరిత్ర..స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తర్వాత అంతటి అశేష ప్రజాధారణ పొందిన ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి..మధ్యలో రాజకీయాలు అంటూ పదేళ్లు సినిమాలకు దూరమైనా మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150 ‘ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో మన అందరికి తెలిసిందే..బాహుబలి తర్వాత వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమా ఇదే..ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘సై రా నరసింహ రెడ్డి’ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..అలా రెండు సినిమాలు వరుసగా భారీ బ్లాక్ బసుతీ హిట్స్ కొట్టి నేటి తరం స్టార్ హీరోలకే సవాలు విసిరాడు మెగాస్టార్ చిరంజీవి..కానీ ఈ ఏడాది విడుదలైన మెగాస్టార్ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28 వ తారీఖున విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం ఎంత పెద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో అందరికి తెలిసిందే..ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్ రాలేదు అనుకుందాం..కానీ ఆ తర్వాత దసరా కానుకగా విడుదలైన ‘గాడ్ ఫాదర్ ‘ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో ఫెయిల్యూర్ గా నిలిచింది..ఫుల్ రన్ లో కనీసం 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం..ఈ రెండు సినిమాలు ఫెయిల్యూర్ అవ్వడం తో చిరంజీవి కి తన మార్కెట్ మీద అనుమానం కలిగింది..అందుకే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సోలో రిలీజ్ డేట్ లో విడుదల చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా..ఆ డేట్ ని కాదని జనవరి 13 వ తారీఖున వస్తున్నాడు..ఇది అభిమానులకు చాలా కోపం తెప్పించింది.

ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరోలకు ఓపెనింగ్స్ కీలకం..జనవరి 13 వ తారీఖున సినిమాని విడుదల చేస్తే థియేటర్స్ దక్కవు..ఎందుకంటే అప్పటికే థియేటర్స్ లో బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి ‘ తో పాటుగా తమిళ హీరో విజయ్ ‘వారసుడు’ సినిమా కూడా విడుదలై ఉంటుంది..ఈ రెండు సినిమాల వల్ల వాల్తేరు వీరయ్య కి కేవలం 35 నుండి 40 శాతం థియేటర్స్ మాత్రమే వస్తాయి..టికెట్ రేట్స్ కూడా పెద్దగా ఉండవు..ఫలితంగా ఓపెనింగ్స్ దారుణంగా వస్తాయి..నిర్మాతలు జనవరి 11 వ తేదీన విడుదల చెయ్యాలని ఎంత ప్రయత్నం చేసిన చిరంజీవి మాత్రం 13 వ తేదీన మాత్రమే విడుదల చెయ్యాలని పట్టుబట్టాడట..కారణం 11 వ తేదీ విడుదలై ఒకవేళ టాక్ రాకపోతే పండగ సెలవులు వృధా అయిపోతుంది..అదే జనవరి 13 వ తారీఖున వస్తే టాక్ తో సంబంధం లేకుండా పండగ హాలిడేస్ ని కరెక్టుగా వినియోగించుకుంటుందని చిరంజీవి థియరీ అట..అందుకే ఆ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది..కానీ అభిమానులకు ఓపెనింగ్ రికార్డ్స్ అంటే ఏంటో రుచి చూపించిన చిరంజీవి కి తక్కువ ఓపెనింగ్స్ రావడం వంటివి చూడలేరు..అందుకే ‘సినిమాలు మానేసి ఇంట్లో మనవాళ్లతో ఆడుకో..ఫ్యాన్స్ తో ఆడుకోకు’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…