Home Entertainment సినిమాలకు దూరం కానున్న హీరోయిన్ సాయి పల్లవి..షాక్ లో ఫాన్స్

సినిమాలకు దూరం కానున్న హీరోయిన్ సాయి పల్లవి..షాక్ లో ఫాన్స్

0 second read
0
0
484

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కేవలం అందం తోనే కాదు టాలెంట్ తో కూడా నెగ్గుకురాగలరు అని నిరూపించిన హీరోయిన్స్ అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువమందిలో ఒకరే సాయి పల్లవి..డాక్టర్ చదివిన ఈ అమ్మాయి ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ అనే డాన్స్ షో ద్వారా లైం లైట్ లోకి వచ్చింది..ఈ షో లో ఆమె టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది..ఈ షో ద్వారా ఆమెకి వచ్చిన క్రేజ్ వల్ల మెల్లగా ఆమెకి సినిమా ఆఫర్లు కూడా రావడం మొదలయ్యాయి..అలా తొలి సినిమా మలయాళం లో తెరకెక్కిన ప్రేమమ్ ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది..తొలి సినిమానే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో సాయి పల్లవి కి టాలీవుడ్ నుండి కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి..ఆఫర్స్ వస్తున్నాయి కదా అని ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఒప్పుకునే రకం కాదు సాయి పల్లవి..కంటెంట్ గొప్పగా ఉండాలి..నటనకి మంచి స్కోప్ కూడా ఉండాలి..అప్పుడే ఆమె ఒక సినిమాలో నటించడానికి సంతకం చేస్తుంది..తానూ నియమించుకున్న ఈ కఠినమైన రూల్ ని ఫాలో అవుతూ వస్తుంది.

సాయి పల్లవి ఆ రూట్ లోనే వెళ్ళింది..తెలుగు లో ఆమె మొదటి సినిమా ఫిదా సెన్సషనల్ హిట్ అయ్యింది..ఈ సినిమాలో హీరో కంటే సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ వచ్చింది..తన అద్భుతమైన నటన మరియు డాన్స్ లతో యూత్ ని విశేషంగా ఆకర్షించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది..అభిమానులు ఈమెను ప్రేమగా లేడీ పవర్ స్టార్ అని పిలుచుకుంటారు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మన టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..టాలీవుడ్ లో ఉన్న హీరోలందరికంటే పవన్ కళ్యాణ్ కి ఫాన్స్ ఎక్కువ..అలాంటిది సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్ అంటున్నారంటే ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ఇది కేవలం అందాలు ఆరబొయ్యడం వల్ల వచ్చిన క్రేజ్ కాదు..నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తూ తన టాలెంట్ తో తెచ్చుకున్న క్రేజ్..చాలా అరుదుగా మన టాలీవుడ్ లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి..అలా సాయి పల్లవి కి కూడా జరిగింది..ఫిదా సినిమా తర్వాత ఈమె హీరోయిన్ గా నటించిన MCA , లవ్ స్టోరీ , శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు సంచలన విజయాలు గా నిలిచాయి.

తమిళం లో కూడా ఈమె నటించిన సినిమాలు దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి..అలా కెరీర్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సాయి పల్లవి కెరీర్ లో ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయాలుగా నిలిచాయి..రానా హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విరాట పర్వం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది..ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి అద్భుతమైన మార్కులు వచ్చాయి..కానీ కమర్షియల్ ఎలెమెంట్స్ ఏమి లేకపోవడం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది..ఆ తర్వాత ఈమె చేసిన గార్గి అనే సినిమాకి కూడా అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి..సాయి పల్లవి నటనకి అయితే అందరూ ఫిదా..కానీ ఈ సినిమా కూడా కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది..అలా వరుసగా ఫ్లాప్స్ రావడం తో సాయి పల్లవి తో ప్రస్తుతం అలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ రోల్స్ ఉన్న సినిమాలు తియ్యడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించడం లేదట..గ్లామర్ పాత్రలు చెయ్యాల్సింది గా ఒత్తిడి పెరుగుతుందట..అవసరం అయితే సినిమాలు వదిలేసి క్లినిక్ ని అయినా నడుపుకుంటాను కానీ మనసుకి నచ్చని పనిని చెయ్యను అంటూ తెగేసి చెప్తుంది అట సాయి పల్లవి..దీనితో ఆమె కెరీర్ డైలమా లో పడింది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..కానీ సాయి పల్లవి తానూ ఎంచుకున్న దారిలోనే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి అందరి నోర్లు ముయ్యిస్తుందని అభిమానులు గట్టిగ నమ్ముతున్నారు..మరి వారి నమ్మకం ని సాయి పల్లవి ఎంత వరుకు నిలబెట్టుకోగలడో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

హాలీవుడ్ మూవీ అవతార్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. …