Home Entertainment సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ సాయి పల్లవి..శోకసంద్రం లో ఫాన్స్

సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరోయిన్ సాయి పల్లవి..శోకసంద్రం లో ఫాన్స్

0 second read
0
0
616

టాలీవుడ్‌లో లేడీ పవర్‌స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న సాయిపల్లవి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోలతో సమానంగా ప్రాధాన్యత ఉండే పాత్రల్లో మాత్రమే నటించే సాయిపల్లవి త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మలయాళ సినిమా ప్రేమమ్‌తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తక్కువ టైమ్‌లోనే సాయిపల్లవి స్టార్‌ హీరోయిన్‌గా మారింది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుందని.. అందుకే కొత్త సినిమాలను ఒప్పుకోవడం లేదని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని సాయిపల్లవి స్వయంగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. దీంతో కొద్దిరోజులు ఈ వార్తలు సద్దుమణిగాయి. అయితే తాజాగా మళ్లీ సాయిపల్లవి సినిమాలకు దూరంగా కాబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. దీనికి మరో కారణం ఉందని అంటున్నారు. సాయిపల్లవి డాక్టర్‌ చదివిందని అందరికీ తెలిసిన విషయమే. జార్జియాలో వైద్య విద్యను అభ్యసించిన సాయిపల్లవి ఇండియా వచ్చిన తర్వాత నటిగా మారింది.

అయితే ఇప్పుడు తాను చదివిన చదువుకు న్యాయం చేయాలని సాయిపల్లవి భావిస్తోంది. దీంతో వైద్యవృత్తిని స్వీకరించాలని నిర్ణయించుకుంది. అందుకే ఇప్పటివరకు సంపాదించిన డబ్బులతో కోయంబత్తూర్‌లో సొంతంగా ఒక హాస్పిటల్‌ను నిర్మిస్తోందని ఫిలింనగర్‌లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ ఆస్పత్రిని సాయిపల్లవితో పాటు ఆమె చెల్లెలు పూజా కలిసి చూసుకోబోతున్నారని తెలుస్తోంది. అందుకే ఇటీవల కొత్త సినిమాలను అంగీకరించలేదని.. సినిమాలను పూర్తిగా వదిలేయాలని అనుకుంటున్నట్టుగా టాక్‌ వినిపిస్తోంది. ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది తెలియాలంటే సాయిపల్లవి స్వయంగా స్పందించాల్సి ఉంటుంది. గత ఏడాది లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ఈ ఏడాది గార్గి, విరాటపర్వం సినిమాల్లో నటించింది. కానీ అవి యావరేజ్ టాక్ మాత్రమే సంపాదించుకున్నాయి. సాయిపల్లవిది తమిళనాడులోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. సాయి పల్లవి వయసు 30 ఏళ్లు. ఇండస్ట్రీకి 12 ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. 2005లో వచ్చిన కస్తూరి మాన్ అనే తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది సాయి పల్లవి. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో నటించింది.

ప్రస్తుతం స్టార్‌ హీరోల పక్కన హీరోయిన్‌గా ఆఫర్లు వస్తున్నా సాయిపల్లవి సున్నితంగా తిరస్కరిస్తుందని తెలుస్తోంది. అందుకే ఆమె చేతిలో తెలుగు సినిమా ఒక్కటి కూడా లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోయి ఆడియన్స్‌నే ఆకట్టుకునే నటన సాయిపల్లవికి మాత్రమే సొంతం. నేచురల్ నటనకు కేరాఫ్ అడ్రస్ సాయి పల్లవి. వైవిద్యభరితమైన పాత్రలతో, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. వెండితెరపై తనదైన అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ, కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ద్వారానే ప్రేక్షకులను మెప్పిస్తోంది. సాయిపల్లవి మంచి నటి మాత్రమే కాదు మంచి డ్యాన్సర్ కూడా. ఆమె డ్యాన్స్ చేసిందంటే అభిమానులు ఫిదా కావాల్సిందే. లవ్‌స్టోరీలో తర రంపం, శ్యామ్‌సింగరాయ్‌లో ప్రణవాలయ సాంగ్స్ ఆమెలోని బెస్ట్ డ్యాన్సర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. మంచి మాస్ మసాలా, కమర్షియల్ సినిమాల్లో కూడా హీరోయిన్‌గా నటించాలని ఉందని కొన్ని ఇంటర్వ్యూలలో తన మనసులోని మాటను సాయిపల్లవి బయటపెట్టింది. కానీ అంతలోనే షాకింగ్ డెసిషన్ తీసుకుని అభిమానులను నిరుత్సాహపరుస్తోంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…