
సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటు తో మరణించడం యావత్తు సినీ లోకాన్ని, ఆయన కుటుంబాన్ని మరియు ఆయనని అభిమానించే లక్షలాది మంది అభిమానులను శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి మన అందరికి తెలిసిందే..కృష్ణ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చేసిన సేవలు..ఆయన సాధించిన ఘనతలు మరియు రికార్డ్స్ ని స్మరించుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు అభిమానులు..ఇక ఒకే ఏడాది అన్నయ్య ని, తల్లిని మరియు తండ్రిని కోల్పోయిన మహేష్ మానిసిక పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనకక్కర్లేదు..అతని మానసిక స్థితిని తల్చుకుంటే మన కళ్ళలో నుండి నీళ్లు కారిపోతాయి..గుండె బరువెక్కి పోతుంది..అలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదు అని అనుకుంటాం..ఇక అలాంటి విషాద సంఘటనలన్నీ మోస్తున్న మహేష్ బాబు మానసిక స్థితి ఊహించడానికి కూడా కష్టం గా ఉంది..కానీ తానూ ధైర్యం కోల్పోతే నన్ను అభిమానించే కోట్లాది మంది అభిమానులు ఏమైపోతారు..తనని నమ్ముకున్న కుటుంబం ఏమైపోతుంది అనేది అలోచించి మహేష్ తనలో శిఖరం లాంటి బాధని దాచేసుకున్నాడు.
అయితే బయటకి కనపడకుండా మహేష్ బాబు బాధని దాచేస్తున్నాడు కానీ..లోలోపల అతను మానసికంగా ఎంతో కృంగిపోయి ఉన్నాడు..ఇలాంటి సమయం లో సినిమాల మీద పూర్తి స్థాయి ఫోకస్ చేయలేనని..సినిమా మీద శ్రద్ద పెట్టకుండా చేస్తే ఔట్పుట్ బాగా రాదనీ..కొద్దీ రోజులు నన్ను ఒంటరిగా వదిలేయండి..సెట్ అయ్యాక షెడ్యూల్స్ పెట్టుకుందాం అని త్రివిక్రమ్ తో అన్నాడట మహేష్ బాబు..త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేస్తున్న సంగతి సంగతి మన అందరికి తెలిసిందే..రెండు నెలల క్రితం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించి ఒక చిన్న యాక్షన్ సన్నివేశం ని పూర్తి చేసారు..ఈ షెడ్యూల్ జరుగుతున్న సమయం లోనే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోయింది..ఈ బాధ నుండి కోలుకోవడానికి మహేష్ కి రెండు నెలల సమయం పట్టింది..ఫారిన్ లో ఒంటరిగా ఏకాంతంగా ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో రూమ్ తీసుకొని గడిపాడు మహేష్..ఇప్పుడు తనకి ఎంతో బలంగా మారిన కృష్ణ గారు కూడా చనిపోవడం తో మరో ఆరు నెలలు షూటింగ్ లో పాల్గొనే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
అంటే త్రివిక్రమ్ తో ప్రస్తుతం చెయ్యబోతున్న సినిమా 2024 సమ్మర్ వరుకు విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తుంది..ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభిద్దాం అనుకున్న మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ కూడా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది..మహేష్ మానసికంగా దెబ్బతినడం వల్ల తన సినిమా షూటింగ్స్ అన్ని డైలమా లో పడ్డాయి..ఒక్కోసారి దేవుడు ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడు..చెడ్డవాళ్ళు ఈ లోకం లో ఎంతోమంది ఉండగా మంచివాళ్ళకే ఎందుకు ఇన్ని కష్టాలు కలిగిస్తాడు అనేది తల్చుకుంటే బాధేస్తుంది..గ్రామాల్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసి రోడ్లు మరియు స్కూల్స్ నిర్మించిన ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి..ఎన్నో వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి తనలోని ఉదార స్వభావం ని చూపించిన గొప్ప మనస్తత్వం ఉన్న మహేష్ బాబు కి ఆ దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడని అభిమానులు ఆరోపిస్తున్నారు..కనీసం ఆయనకీ ఈ బాధని మోసేంత ధైర్యం ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.