
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కప్పుడు ఒక్క వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి నేటికీ మంచి డిమాండ్ ఉన్న నటీనటులలో ఒక్కరు జయసుధ గారు, ఈమె ఒక్కప్పుడు ఎంత పెద్ద టాప్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎన్టీఆర్ మరియు ఏ యెన్ ఆర్ లతో పాటు కృష్ణ , శోభన్ బాబు మరియు చిరంజీవి వంటి హీరోలతో ఈమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, అయితే మారే ట్రెండ్ ని బట్టి కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీ కి రావడం, అంతే కాకుండా వయస్సు కూడా మీద పడుతుండంతో హీరోయిన్ గా జయసుధ కి అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి,అయితే హీరోయిన్ గా అవకాశాలు తగ్గు ముఖం పట్టడం తో ఆమె క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ కి షిఫ్ట్ అయిపోయింది, ఆమె తీసుకున్న ఆ నిర్ణయం ఆమె కెరీర్ ని ఒక్క రేంజ్ లో మలుపు తిప్పింది అనే చెప్పొచ్చు, ఎందుకంటే మన టాలీవుడ్ లో అమ్మ పాత్ర అంటే వెంటనే గుర్తొచ్చే ఏకైక నటి జయసుధ మాత్రమే, దాదాపు 5 దశాబ్దాల జనరేషన్ హీరోలందరితో కలిసి పని చేసిన ఈమె ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు పంచుకుంది.
ఇక అసలు విషయానికి వస్తే మనకి టాలీవుడ్ హీరోలన్న హీరోయిన్లు అన్న ఎలాంటి క్రష్ ఉఁటుందో ,వాళ్లకి కూడా చిన్నప్పటి నుండి అలాంటి క్రష్ లు ఎన్నో ఉన్నాయి , అలా జయసుధ గారికి కూడా చిన్నతనం నుండి ఒక్క ఇద్దరి పై క్రష్ ఉండేది అట, ఆమె మాట్లాడుతూ ‘నాకు మొదటి నుండి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం ఉండేది, మా ఇంట్లో కూడా నేను అతనినే పెళ్లి చేసుకుంటాను అని మారం చేసేదానిని, కానీ అతనికి పెళ్లి అయిపోవడం తో అప్పట్లో చాలా బాధపడ్డాను, ఇక అతని తర్వాత ప్రముఖ బాలీవుడ్ సింగర్ అంటే కూడా నాకు చాల ఇష్టం ఉండేది, పెళ్లి చేసుకుందాం అనుకుంటే అతను గే అని తెలిసి చేసుకోలేదు, ఇది నేను ఎదో అతనిని కించపరచడానికి చెప్పట్లేదు, తన ఎవరో చెప్పుకునేందుకు ఏ మాత్రం వెనకాడని అలాంటి వాళ్ళు అంటే నాకు ఎంతో గౌరవం మరియు అభిమానం ఉంటుంది ‘ అంటూ చెప్పుకొచ్చింది జయసుధ, ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా చక్కర్లు కొడుతోంది.
ఇక ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జయసుధ నితిన్ కపూర్ అనే అతనిని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరి దంపతులకు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు, ఇటీవలే తన పెద్ద కొడుకు అయినా నీహార్ కపూర్ కి ఘనంగా పెళ్లి చేసిన సంగతి మన అందరికి తెలిసిందే, ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ కి సంబంధించిన ప్రతి ఒక్క సెలబ్రిటీ హాజరు అయ్యారు, ఇక రెండవ కొడుకు శ్రేయన్ కపూర్ సినిమాల్లో హీరో గా ఎంట్రీ కూడా ఇచ్చాడు,ఈయన హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన బస్తి అనే సినిమా ఎప్పుడు విడుదల అయ్యిందో ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా ఎవ్వరికి తెలియదు, దీనితో తనకి సినీ ఇండస్ట్రీ అచ్చి రాదు అని అర్థం చేసుకున్న శ్రేయన్ సినిమాలకు దూరం గా వేరే వ్యాపార రంగం ని వృత్తి గా ఎంచుకొని అందులో గొప్పగా రాణిస్తున్నాడు, ఇక జయసుధ విషయానికి వస్తే ప్రస్తుతం జయసుధ చేతి నిండా తెలుగు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే, తెలుగు తో తమిళ్ భాషలో కూడా ఆమె క్యారక్టర్ ఆర్టిస్టు గా బిజీ గా గడుపుతుంది.