Home Entertainment సర్కారు వారి పాట 4 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

సర్కారు వారి పాట 4 రోజుల వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

1 second read
0
1
7,957

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ తో అదిరిపొయ్యే ట్రైలర్ తో విడుదలకి ముందే ఒక్క రేంజ్ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా, మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ ముందుకి దూసుకుపోతుంది..మహేష్ బాబు నుండి చాల కాలం తర్వాత విడుదల అయినా సినిమా కావడం తో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఫామిలీ ఆడియన్స్ క్యూ కట్టారు..ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ సినిమా వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తున్నాయి..అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులకు గాను ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

 

మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 32 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం..రెండవ రోజు వర్కింగ్ డే అయ్యినప్పటికీ కూడా 9 కోట్ల రూపాయిల షేర్ ని సాధించి స్టడీ కలెక్షన్స్ ట్రెండ్ ని చూపించింది..నూన్ మరియు మాట్నీ షోస్ కంటే ఫస్ట్ షోస్ మరియు సెకండ్ షోస్ అదిరిపోవడం చూస్తూ ఉంటె ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందొ అర్థం అయ్యేలా చేస్తుంది..ఇక శనివారం మరియు ఆదివారం రోజు కూడా ఈ సినిమా అదే ట్రెండ్ ని కొనసాగించింది..శనివారం 8 కోట్ల రూపాయిల షేర్ ని సాధించిన ఈ చిత్రం ఆదివారం కూడా అదే స్థాయి వసూళ్లను సాధించి స్టడీ ట్రెండ్ ని కొనసాగించింది..ఇక ఓవర్సీస్ లో అయితే ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది..కరోనా లాక్ డౌన్ తర్వాత విడుదల అయినా సినిమాలలో #RRR కాకుండా ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్ల మార్కు ని అందుకున్న భీమ్లా నాయక్ , పుష్ప మరియు రాధే శ్యామ్ సినిమాల తర్వాత రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరిన సినిమాగా సర్కారు వారి పాట సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది.

మొత్తం మీద నాలుగు రోజులకు గాను ఈ సినిమా ప్రపంచవ్యప్తంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది అని అంచనా..ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల షేర్ ని కచ్చితంగా అందుకుంటుంది అనే గట్టి నమ్మకం తో ఉన్నారు అభిమానులు..ఇది ఇలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేస్తున్న కొన్ని ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అభిమానుల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది..పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో చేస్తున్న ట్రోలింగ్స్ దెబ్బకి నేరుగా మైత్రి మూవీ మేకర్స్ వారు దిగి వచ్చి వాళ్లకి కౌంటర్ ఇచేలా ట్వీట్స్ వెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..వాళ్ళు ఆలా ట్వీట్స్ వెయ్యడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా రెచ్చిపోయారు..వాళ్ళకి కౌంటర్ ఇచ్చేవిధంగా మహేష్ బాబు అభిమానులు కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తూ ఒక్కరి మీద ఒక్కరు నాన్ స్టాప్ గా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు..కానీ ఏది ఏమైనా ఇలా అసత్య పోస్టర్లు దింపి ఇరువురి హీరోల అభిమానుల మధ్య గొడవలు పెట్టడం ఏ మాత్రం సరికాదు అని, ఇక నుండీ అయినా ప్రొడక్షన్ టీం వారు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అని ట్రేడ్ వర్గాల సాగుతున్న చర్చ.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…