
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి వసూళ్లను దక్కించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..బ్లాక్ బస్టర్ సాంగ్స్ మరియు అదిరిపొయ్యే ట్రైలర్ కట్ తో అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేపిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడం లో సఫలం అయ్యింది..దూకుడు మరియు బిజినెస్ మ్యాన్ వంటి సినిమాల తర్వాత మహేష్ బాబు లో ఆ రేంజ్ కామెడీ టైమింగ్ ని బయటకి తీసిన సినిమా ఇదే..భారీ టికెట్ రేట్స్ వల్ల ఓపెనింగ్స్ డీసెంట్ గా వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయి ఓపెనింగ్ అయితే రాలేదు అనే చెప్పాలి..కానీ లాంగ్ రన్ లో మాత్రం ఈ సినిమా ద్వారా మహేష్ బాబు మరోసారి ఫామిలీ ఆడియన్స్ లో తన బ్రాండ్ ఇమేజి ఎలాంటిదో నిరూపించుకున్నాడు..వీకెండ్స్ లో మాత్రమే కాకుండా మాములు వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ ని వసూలు చేస్తూ పర్వాలేదు అని అనిపించుకుంది..కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఈ సినిమాకి మొదటి రోజు నుండి భారీ హైప్ నంబర్స్ చెప్తూ వచ్చారు..దీని మీద సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేగింది..ఇవ్వన్నీ పక్కన పెడితే రెండు వారాలకు గాను ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం చూద్దాము.
ఈ సినిమాకి మూడు నెలల క్రితం విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కంటే అటు తెలంగాణ లోను, ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోను అధిక టికెట్ రేట్స్ మీద విడుదల అయ్యింది..కానీ మొదటి వారం వసూళ్ళలో మాత్రం భీమ్లా నాయక్ కంటే వెనకపడింది ఈ చిత్రం..భీమ్లా నాయక్ మొదటి వారం లో ప్రపంచ వ్యాప్తంగా 90 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా..సర్కారు వారి పాట సినిమా మాత్రం కేవలం 88 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..ఇక రెండవ వీకెండ్ లో కూడా ఈ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లు దక్కించుకోలేకపోయింది..ఆదివారం నాడు మ్యాట్నీస్ నుండి ఫుల్స్ పడినా కూడా , ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి అది ఏ మాత్రం సరిపోదు..ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 120 కోట్ల రూపాయలకు జరిగింది..మహేష్ బాబు గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం తో ఈ సినిమాని భారీ రేట్స్ మీద కొనడానికి బయ్యర్లు ఎగబడ్డారు.
కానీ ఈ సినిమా ఆ 120 కోట్ల రూపాయిలను రికవర్ చెయ్యడం దాదాపుగా అసాధ్యం అనే అనిపిస్తుంది..రెండవ వీకెండ్ పూర్తి అయ్యే సరికి ఈ సినిమా కేవలం 93 కోట్ల రూపాయిలు మాత్రం వసూలు చేసింది..ఇక రెండవ వారం లో వర్కింగ్ డేస్ లో ఈ మూవీ కలెక్షన్లు బాగా వీక్ అయ్యాయి..దీనితో ఈ సినిమా క్లోసింగ్ 98 కోట్ల రూపాయిల లోపే ఉంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..అదే కనుక జరిగితే ఈ సినిమాకి దాదాపుగా 25 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వాటిల్లే అవకాశం ఉన్నది..మరో పక్క ఈ సినిమా మహేష్ బాబు కి స్ట్రాంగ్ ఫోర్ట్ అయినా USA లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం చాలా కష్టం అనే చెప్పొచ్చు..అలా మహేష్ కెరీర్ లో ఈ సినిమా ఒక్క కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచిపొయ్యే ఛాన్స్ మెండుగా ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇదే కనుక జరిగితే స్పైడర్ సినిమా తర్వాత మహేష్ కెరీర్ లో కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది ఇదే అని చెప్పొచ్చు.