
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది..కానీ టికెట్ రేట్స్ అధికంగా ఉండడం వల్ల అటు ఆంధ్ర ప్రదేశ్ లోను ఇటు తెలంగాణ లోను ఆశించిన స్థాయి వసూళ్లను అందుకోవడం లో ఈ సినిమా మొదటి రోజు నుండే విఫలం అవుతూ వస్తుంది..పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ తగ్గించడం తో ఇప్పుడు ఈ సినిమాని థియేటర్స్ లో చూసే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ పోతుంది..ఇది ఇలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ పై మొదటి రోజు నుండే సోషల్ మీడియా లో రకరకాల చర్చలు సాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..మొదటి రోజు నుండే ఈ సినిమాకి విపరీతమైన ఫేక్ కలెక్షన్స్ వచ్చాయి అని సోషల్ మీడియా లో ట్రేడ్ ప్రముఖుల నుండి కూడా వస్తున్న టాక్..ఈ క్రమం లో ఈ సినిమా నిజమైన కలెక్షన్స్ ఎంత అనేదానిపై సుదీర్ఘమైన పరిశోధనలు చేసి ఇప్పుడు మీ ముందు ఈ ఆర్టికల్ లో ఉంచబోతున్నాము.
మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల రూపాయిలు వచ్చాయి అని ఆ చిత్ర నిర్మాతలు పోస్టర్స్ విడుదల చేసారు..ఇది పూర్తిగా ఫేక్ అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వార్త..వాళ్లకి ఉన్న విశ్వసనీయ సోర్స్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కేవలం 32 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసింది..నిర్మాతలు నోటికి వచ్చిన లెక్కలు చూపిస్తున్నారు అని మండిపడ్డారు..ఇక రెండవ రోజు ఈ సినిమాకి ఏకంగా 11 కోట్ల రూపాయిల షేర్ వచ్చినట్టు..ఒక్క నైజం ఏరియా నుండే రెండవ రోజు 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది అని నిర్మాతలు చెప్పారు..ఇది పూర్తి గా ఫేక్ అని..రెండవ రోజు ఈ సినిమా ఇటీవల విడుదల అయిన భీమ్లా నాయక్ మరియు KGF చిత్రాలకు ఒక్క చోట కూడా దరిదాపుల్లోకి రాలేదు అని..రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 8 కోట్ల రూపాయిల షేర్ కి మించి ఉండదు అని తేల్చి చేప్పేసారు..అలా మొదటి రోజు నుండి 7 వ రోజు వరుకు ఈ సినిమాకి ఇష్టమొచ్చినట్టు ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారు అని ట్రేడ్ వర్గాల ఆందోలన..మొదటి వారం కేవలం 85 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన చిత్రానికి, నిర్మాతలు 95 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు చూపించారు అని, ఇలా చెయ్యడం వల్ల మహేష్ బాబు కి చెడ్డ పేరు వస్తుంది అని వాళ్ళు ఆరోపించారు.
మొత్తం మీద పది రోజులకు గాను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 89 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసింది అని..ఫుల్ రన్ లో మరో నాలుగు కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉంది ట్రేడ్ పండితుల అభిప్రాయం..ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 120 కోట్ల రూపాయలకు జరిగింది అట..కానీ ఫుల్ రన్ లో ఈ సినిమా వంద కోట్ల రూపాయిల లోపే ముగియబోతుండడం తో బయ్యర్లకు సుమారు గా పాతిక కోట్ల రూపాయిల నష్టం వాటిల్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది..ఒక్క పక్క బయ్యర్లకు నష్టాలు వస్తుంటే ప్రొడ్యూసర్లు ఏమి పట్టించుకోకుండా అదనంగా ఫేక్ కలెక్షన్స్ చెప్పమని డిస్ట్రిబ్యూటర్స్ ని వత్తిడి చెయ్యడం ఏ మాత్రం సబబు కాదు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..ఇలా ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవడం వల్ల ఇద్దరి హీరోల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది అని..ఇక నుండి అయిన అలంటి వాటికి చెక్ పెట్టాలని ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది పెద్దల కోరిక..ఇక ఇటీవలే ఇలా ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ పై దిల్ రాజు మాట్లాడుతూ, ఇలా చెప్పుకోవడం వల్ల ఏమి లాభం ఉండదు అని..త్వరలోనే విదేశాల్లో లాగ ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కలెక్షన్స్ ట్రాకింగ్ సిస్టం వస్తుంది అని..అప్పుడు ప్రతి సినిమాకి నిజమైన కలెక్షన్స్ బయటకి వస్తాయి అని దిల్ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు.