Home Entertainment సర్కారు వారి పాట సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల

సర్కారు వారి పాట సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆ చిత్ర దర్శకుడు పరశురామ్ పెట్ల

0 second read
0
0
7,806

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా పరశురామ్ పెట్ల దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12 వ తేదీన విడుదల అయ్యి సూపర్ హిట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే..2020 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదల అయినా బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ తర్వాత మళ్ళీ మహేష్ బాబు నుండి వస్తున్నా సినిమా ఇదే..కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమాకి సుమారు రెండేళ్ల సుదీర్ఘ విరామం దక్కింది..బాగా గాప్ రావడం తో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసారు..దాంతో యావరేజి టాక్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాని అభిమానులు మరియు మహేష్ ని అభిమానించే ప్రేక్షకులు ఇరగబడి చూసారు..సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ సినిమా దర్శక నిర్మాతలు సక్సెస్ మీట్స్ లో తరుచు పాల్గొంటున్నారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..అదేమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో సర్కారు వారి పాట సినిమా గురించి రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి..అవేమిటి అంటే మహేష్ బాబు కి మరియు డైరెక్టర్ పరశురామ్ కి ఈ సినిమా విషయం లో గొడవలు జరిగాయి అని..సినిమా అవుట్ పుట్ ఆశించిన స్థాయి లో రాకపోవడం తో డైరెక్టర్ పై మహేష్ బాబు చిరాకు పడ్డాడు అని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో వచ్చాయి..ఈ విషయం పై ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రొమోషన్స్ లో పరుశురాం తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు..ఆయన మాట్లాడుతూ ‘ పెద్ద హీరోలతో సినిమా అన్నప్పుడు ఇలాంటివి చిరాకులు హీరోలకు రావడం సహజం..మహేష్ నా మీద అరిచాడు అని సోషల్ మీడియా లో వచ్చిన వార్తలు నిజమే..ఈ సినిమా కోసం మహేష్ బాబు కరోనా కారణంగా దాదాపుగా మూడేళ్ళ సమయం ని కేటాయించారు..కాబట్టి మధ్యలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ కూడా ఆయన నన్ను తన సొంత సోదరుడు లాగానే చూసుకున్నాడు..అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేసిన చేసిన షూటింగ్ ని కొన్ని అనివార్య కారణాల వల్ల మేము రామోజీ ఫిలిం సిటీ కి మార్చాము..దీనికి మహేష్ బాబు గారు కాస్త అప్సెట్ అయ్యి చిరాకు పడ్డారు..అంతే కానీ సోషల్ మీడియా లో వస్తున్నట్టు మహేష్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్ లో వేలు పెట్టాడు లాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం’ అంటూ చెప్పుకొచ్చాడు పరశురామ్ పెట్ల.

ఇక ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు అతి త్వరలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించబోయ్యే సినిమాలో నటించబోతున్నాడు..ఖలేజా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..ఈ సినిమా తర్వాత ఆయన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించబోయ్యే సినిమాలో నటిస్తున్నాడు..వీళ్లిద్దరి కాంబినేషన్ కోసం అభిమానులు మాత్రమే కాదు,తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంది..ఈ సినిమా ఫైనల్ స్క్రిప్ట్ వినడానికి ఇటీవలే మహేష్ మరియు రాజమౌళి దుబాయి కి వెళ్లారు..రాజమౌళి తన స్టోరీ సిట్టింగ్స్ అన్ని దుబాయిలోనే వేస్తాడు అనే విషయం మన అందరికి తెలిసిందే..అంటే కాకుండా తన హీరోలకు సంబంధించిన లుక్ టెస్ట్స్ కూడా అక్కడ వర్క్ షాప్ లో చేస్తూ ఉంటాడు రాజమౌళి..మహేష్ బాబు కి కూడా లుక్ టెస్ట్ చెయ్యనున్నారు అని తెలుస్తుంది…ఈ ఏడాది లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడు అట రాజమౌళి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…