Home Entertainment సర్కారు వారి పాట సినిమాకి వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సర్కారు వారి పాట సినిమాకి వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

0 second read
0
0
43,644

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది..మహేష్ బాబు నుండి చాలా కాలం తర్వాత వస్తున్నా ఎంటర్టైన్మెంట్ మూవీ కావడం, పాటలు మరియు ట్రైలర్ కి అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ రావడం తో ట్రేడ్ సర్కిల్స్ లో కూడా ఈ మూవీ పై విడుదలకి ముందే భారీ అంచనాలు ఉండేవి..దానికి తగ్గట్టు గానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి..కానీ టికెట్ రేట్స్ ప్రభావం వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ పై భారీ స్థాయి ప్రబావం చూపించింది అనే చెప్పాలి..సిటీస్ లో ఓపెనింగ్స్ పర్వాలేదు అని అనిపించినప్పటికీ, రురల్ ప్రాంతాలలో మాత్రం దారుణమైన ఓపెనింగ్స్ ని నమోదు చేసుకుంది ఈ చిత్రం..దీనితో ఈ సినిమాకి మొదటి రోజు పూర్తి అయ్యేసరికి టాక్ కి తగ్గ ఓపెనింగ్స్ మాత్రం రాలేదు అనే చెప్పాలి..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలకు జరగగా మొదటి రోజు ఎంత వరుకు రికవరీ చేసిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఈ సినిమా కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి..రెండు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ అమెరికా లో మాత్రం దాదాపుగా 1 మిలియన్ డాలర్లు వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది..అమెరికా లో ఈ సినిమా ని 26 లక్షల డాలర్లకు కొనుగోలు చెయ్యగా, ఫుల్ మొదటి రోజే 40 శాతం రికవరీ ని సాధించింది..ఈ వీకెండ్ మంచి వసూళ్లను రాబడితే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనే నమ్మకం తో ఉన్నారు బయ్యర్లు..ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 90 కోట్ల రూపాయలకు జరిగింది..మొదటి రోజు దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 26 నుండి 27 కోట్ల రూపాయిల వసూళ్లు ఈ సినిమాకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..అంటే మొత్తం మీద మొదటి రోజు ఈ సినిమా 25 శాతానికి పాగా రెండు తెలుగు రాష్ట్రాలలో రెకాఎవెర్య్ ని సాధించింది..లాంగ్ వీకెండ్ ఉండడం తో నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 50 శాతం కి పైగా రికవరీ మార్కుని అందుకునే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ పండితుల అంచనా.

మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 36 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజు దక్కించుకునే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఇది మహేష్ బాబు కెరీర్ లో టాప్ 2 ఓపెనింగ్ గా చెప్పొచ్చు..రెండేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదటి రోజు దాదాపుగా 42 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఓపెనింగ్స్ ఎలా ఉన్నా టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలకు ఫుల్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే సంగతి మన అందరికి తెలిసిందే..మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు అలా ఆడినవే అని మహేష్ బాబు అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే స్థాయి లో ఫుల్ రన్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి..ఈ వీకెండ్ వరుకు ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి..ఇక ఆ తర్వాత సోమవారం నుండి ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనే దానిపైనే ఈ సినిమా ఫుల్ రన్ ఆధారపడి ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..చూడాలి మరి మహేష్ బాబు మేజిక్ ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుతుందో లేదో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…