Home Entertainment సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
1,261

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన సర్కారు వారి పాట సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీగా అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది..మహేష్ బాబు తన అద్భుతమైన ఎనర్జీ తో ఈ సినిమా ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు అనే చెప్పాలి..ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ గా చెప్పుకోవచ్చు..టాక్ పాజిటివ్ గా వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం చాలా డీసెంట్ గానే వచ్చాయి కానీ రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ ని మాత్రం ఈ సినిమా సొంతం చేసుకోలేకపోయింది..దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్స్ అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం..టికెట్ రేట్స్ భారీ గా ఉండడం వల్ల ఈ చిత్రం పై అటు తెలంగాణ లో ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో జనాలు థియేటర్స్ కి కదిలి వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు..రెండు వారాల క్రితం విడుదల అయినా ఆచార్య సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది..కానీ ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది, సర్కారు వారి పాట సినిమాకి మంచి టాక్ వచ్చినప్పటికీ కూడా మాములు ఓపెనింగ్స్ రావడం గమనార్హం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్స్ తెచుకున్నప్పటికీ, ఓవర్సీస్ లో మాత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లను ఈ సినిమా నమోదు చేసుకుంది..కేవలం ప్రీమియర్స్ నుండే 1 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం , పోస్ట్ కరోనా తర్వాత అత్యధిక ప్రీమియర్స్ సాధించిన చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించింది..దీనికి ముందు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం 9 లక్షల డాలర్లు వసూలు చేసి టాప్ లో నిలవగా , సర్కారు వారి పాట చిత్రం 1 మిలియన్ డాలర్లు వసూలు భీమ్లా నాయక్ రికార్డు ని బద్దలు కొట్టింది..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మాత్రం ఈ సినిమాకి చాలా సాధారణమైన ఓపెనింగ్స్ వచ్చాయి..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఈ సినిమాకి కేవలం 25 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే దక్కే అవకాశం ఉంది అని తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 26 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఆ సినిమాకి సర్కారు వారి పాట సినిమాకి ఉన్న రేంజ్ లో టికెట్ రేట్లు లేకపోయినా కుమ్మేసింది అనే చెప్పాలి.

మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 36 కోట్ల రూపాయిల షేర్ ని మొదటి రోజు దక్కించుకునే అవకాశం ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..ఇది మహేష్ బాబు కెరీర్ లో టాప్ 2 ఓపెనింగ్ గా చెప్పొచ్చు..రెండేళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా మొదటి రోజు దాదాపుగా 42 కోట్ల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది..ఓపెనింగ్స్ ఎలా ఉన్నా టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాలకు ఫుల్ రన్ లో మంచి వసూళ్లు వచ్చే సంగతి మన అందరికి తెలిసిందే..మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలు అలా ఆడినవే అని మహేష్ బాబు అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు..ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా అదే స్థాయి లో ఫుల్ రన్ ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి..ఈ వీకెండ్ వరుకు ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి..ఇక ఆ తర్వాత సోమవారం నుండి ఎలా పెర్ఫర్మ్ చేస్తుంది అనే దానిపైనే ఈ సినిమా ఫుల్ రన్ ఆధారపడి ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..చూడాలి మరి మహేష్ బాబు మేజిక్ ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుతుందో లేదో.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…