Home Entertainment సర్కారు వారి పాట మొదటి రోజు కలెక్షన్స్ ని దాటేసిన జల్సా స్పెషల్ షోస్ గ్రాస్

సర్కారు వారి పాట మొదటి రోజు కలెక్షన్స్ ని దాటేసిన జల్సా స్పెషల్ షోస్ గ్రాస్

0 second read
0
0
175

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో జల్సా మూవీ షోలను ప్రదర్శిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2008లో విడుదలైన జల్సా మూవీ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ మూవీని రీరిలీజ్ చేస్తుండగా టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ నెలకొంది. 4కే ప్రొజెక్షన్ క్వాలిటీ, డాల్బీ ఎట్మాస్ టెక్నాలజీతో రిలీజ్ చేస్తుండటంతో సంజయ్ సాహూను మరోసారి తెరపై చూడాలని అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ పుట్టినరోజు కానుకగా ఒకరోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 1వ తేదీనే జల్సా షోలను ప్రదర్శిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న స‌మాచారం ప్ర‌కారం జ‌ల్సాకు 500 స్పెష‌ల్ షోల‌ను ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికా, ఆస్ట్రేలియాల్లో కూడా జ‌ల్సా స్పెష‌ల్ షోలు ప‌డ‌బోతున్నాయని ఇన్‌సైడ్ టాక్‌. అంతేకాదు స్పెష‌ల్ షో వేస్తున్న చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో థియేట‌ర్లు హౌస్ ఫుల్ బోర్డులు ప‌డ‌బోతున్నాయ‌న్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విశేషం ఏంటంటే మహేష్‌బాబు హీరోగా ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమా తొలిరోజు వసూళ్లను జల్సా స్సెషల్ షోలు దాటేసినట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల సర్కారు వారి పాట సినిమాకు తొలిరోజు హౌస్ ఫుల్ బోర్డులు పడని చోట కూడా జల్సా స్పెషల్ షోలకు హౌస్‌ఫుల్ అయినట్లు చెప్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో పవర్ స్టార్, సూపర్ స్టార్ అభిమానుల మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ఇప్పటికే బుక్ మై షో ద్వారా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురాగా అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 2008లోనే రూ.33 కోట్లకు పైగా జల్సా మూవీ షేర్ వసూలు చేసింది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఈ సినిమా బీజం వేసింది. ఈ సినిమా తర్వాతే వీళ్ల కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు తెరకెక్కాయి. అయితే ఇటీవల మహేష్ పోకిరి సినిమాను కూడా ఇదే రీతిలో స్పెషల్ షోలు ప్రదర్శించగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు జల్సా మూవీ షోలను పవర్ స్టార్ అభిమానులు ప్లాన్ చేశారు.

జల్సా మూవీలో ఇలియానా, క‌మలినీ ముఖ‌ర్జీ, పార్వ‌తి మెల్ట‌న్ ఫీ మేల్ లీడ్ రోల్స్ మెరిశారు. ముఖేశ్ రుషి విల‌న్‌గా న‌టించ‌గా ప్ర‌కాష్ రాజ్‌, అలీ, త‌నికెళ్ల‌భ‌ర‌ణి,శివాజీ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. దేవిశ్రీ అందించిన పాటలు యువతను ఉర్రూతలూగించాయి. అటు బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. జల్సా మూవీ స్పెషల్ షోలను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో దేవి, సుదర్శన్, సంధ్య 70, సంధ్య 35 ఎంఎం థియేటర్లలో ప్రదర్శిస్తుండగా అన్ని షోలు ఫుల్ అయిపోయాయి. అటు ప్రసాద్ ఐమ్యాక్స్, ఏఎంబీ మాల్‌లోనూ జల్సా మూవీ స్పెషల్ షోలను ప్రదర్శించారు. ఖుషి తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా మూవీ ఓ విందు భోజనంలా నిలిచింది. ఈ సినిమా కమర్షియల్‌గా సంచలన విజయం సాధించింది. అటు పవన్ నటించిన తమ్ముడు మూవీ స్పెషల్ షోలు కూడా పవర్ స్టార్ బర్త్ డే కానుకగా ప్రదర్శించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…