Home Entertainment సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు టాప్ 5 లిస్ట్ లో ఉందా?? వీళ్ళలో ఎవరిదీ పై చెయ్యి ?

సర్కారు వారి పాట మొదటి రోజు వసూళ్లు టాప్ 5 లిస్ట్ లో ఉందా?? వీళ్ళలో ఎవరిదీ పై చెయ్యి ?

2 second read
0
0
1,112

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా నిన్న ఘనంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ చిత్రానికి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ అధిక టికెట్ రేట్స్ ప్రభావం ఈ సినిమా పైన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలలో చాలా గట్టిగ పడింది అనే చెప్పాలి..కొన్ని ప్రణతాలలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఓపెనింగ్స్ కంటే సర్కారు వారి పాట ఓపెనింగ్స్ తక్కువ ఉండడం విశేషం..ఇక నైజం ప్రాంతం లో అయితే ఈ సినిమా హైదరాబాద్ లో మినహా రురల్ ప్రాంతాలలో అతి దారుణమైన ఆక్యుపెన్సీలను సొంతం చేసుకుంది..నైజం ప్రాంతం లో నాన్ #RRR రికార్డు గా ఉన్న భీమ్లా నాయక్ రికార్డు ని ఈ సినిమా దాటుతుంది అని అందరూ అనుకున్నారు..కానీ ఆ ప్రాంతం లో మొదటి ఆట నుండే సరైన ఆక్యుపెన్సీ లేకపోవడం తో కొన్ని చోట్ల షోస్ కూడా రద్దు అయినా పరిస్థితి ఏర్పడింది..నైజం రురల్ ప్రాంతాలలో ఓపెనింగ్స్ సరిగా రాకపోవడానికి ప్రధాన కారణం టికెట్ రేట్స్ అని చెప్పొచ్చు.

నైజం ప్రాంతం లో ప్రస్తుతం నాన్ #RRR రికార్డు గా ఉన్న చిత్రం పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్..ఈ సినిమా ఇక్కడ మొదటి రోజు దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ ని దక్కించుకుంది..ఈ సినిమా తర్వాత విడుదల అయినా #RRR మినహా రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు ఏది కూడా దీని రికార్డు ని కొట్టలేకపోయింది..మహేష్ బాబు సర్కారు వారి పాట కచ్చితంగా భీమ్లా రికార్డు ని కొడుతోంది అనే అందరూ అనుకున్నారు..కానీ ఈ సినిమా 10 ఓట్ల రూపాయిల షేర్ వద్దనే ఆగిపోయ్యే సూచనలు ఉన్నట్టు కనిపిస్తుంది..మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 36 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..భీమ్లా నాయక్ మొదటి రోజు వసూళ్లు దాదాపుగా 38 కోట్ల రూపాయిల వరుకు చేసింది..భీమ్లా నాయక్ సినిమాకి సర్కారు వారి పాట సినిమా రేంజ్ లో టికెట్ రేట్స్ లేవు..అయ్యినప్పటికీ కూడా ఈ సినిమా మొదటి రోజ్ వసూళ్లను దాటడం లో విఫలం అయ్యింది సర్కారు వారి పాట చిత్రం.

ఇక గత రెండు వారల క్రితం విడుదల అయినా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రానికి ఘోరమైన డిజాస్టర్ టాక్ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..దాని వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ పైన కూడా గట్టి ప్రభావమే ఉంది..సర్కారు వారి పాట సినిమాకి ఉన్న టికెట్ రేట్స్ ఈ సినిమాకి కూడా ఉంది..కానీ హిట్ కి ఫ్లాప్ కి మధ్య ఉన్న తేడా కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే అవ్వడం విశేషం..మహేష్ బాబు నటంచిన సర్కారు వారి పాట ప్రపంచ వ్యాప్తంగా 36 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యగా, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రం 33 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..దీనితో ప్రస్తుతానికి అందరికంటే ఇటీవల కాలం లో విడుదల అయినా సినిమాలలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం అగ్ర స్థానం లో ఉండడం విశేషం..ఈ సినిమాకి కనుక టికెట్ రేట్స్ ఇచ్చి ఉంటె కచ్చితంగా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల నుండి 50 కోట్ల రూపాయిలు షేర్ ని సొంతం చేసుకొని ఉండేది అని ట్రేడ్ వర్గాల అంచనా.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

చిరంజీవి ఇంట్లో బాలయ్య బాబు సినిమా షూటింగ్..షాక్ లో ఫాన్స్

మన టాలీవుడ్ లో చిరంజీవి మరియు బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా…