Home Entertainment సర్కారు వారి పాట నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

సర్కారు వారి పాట నుండి తొలగించిన అద్భుతమైన సన్నివేశం ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
4,431

సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో నాలుగో వారం విజయవంతంగా రన్ అవుతోంది. వీక్ డేస్‌లో కలెక్షన్‌లు ఎలా ఉన్నా వీకెండ్‌లో మాత్రం ఈ మూవీ సంతృప్తికర స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీలో చర్చించిన సామాజిక అంశం ప్రేక్షకులకు నచ్చింది. దీంతో భారీ కలెక్షన్స్ రాబట్టిన సర్కారు వారి పాట మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 250 కోట్ల గ్రాస్ రాబట్టింది. విడుదలైన తొలిరోజు డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మొత్తంగా సర్కారు వారి పాట మహేష్ కెరీర్‌లో హిట్ మూవీగా నిలిచింది.

అయితే మహేష్ అభిమానులకు చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్‌ను అందజేసింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డిలీటెడ్ సీన్‌లను వరుసగా యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తామని తెలిపింది. దీంతో సూపర్ స్టార్ అభిమానులు డిలీటెడ్ సీన్‌ల కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో ఇటీవల ఓ పాటను థియేటర్లలో యాడ్ చేశారు. మురారి వా అంటూ సాగే పాట కోసం ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తున్నారు. ఈ మూవీలో గతంలో రిలీజైన సాంగ్స్ కూడా అన్నీ హిట్ అయ్యాయి. కళావతి, పెన్నీ సాంగ్‌తో పాటు మమ మహేష్ పాట కూడా మాస్‌ను ఆకట్టుకుంది. అయితే నిజానికి సినిమాలో మొదట మమ మహేష్ అనే పాట లేదు. ఈ పాట స్థానంలో మురారి వా అనే సాంగ్‌ను సంగీత దర్శకుడు తమన్ కంపోజ్ చేశాడు. ఈ పాట షూటింగ్ కూడా చేశారు. అయితే ఫ్లోలో చూస్తే సెట్ కాలేదు. దీంతో మహేష్ బాబు మంచి ఊపు వున్న పాట కావాలని కోరడం, అప్పటికప్పుడు మమ మహేష్ కంపోజ్ చేసి స్పెషల్‌గా ఓ భారీ సెట్ వేసి షూట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్వయంగా చెప్పాడు.

కాగా థియేటర్లలో ఇంకా సర్కారు వారి పాట రన్ కొనసాగుతుండగానే అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ స్కీమ్ కింద ప్రదర్శిస్తున్నారు. అంటే అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నపటికీ డబ్బులు చెల్లించి సినిమా చూడాలన్న మాట. రూ. 199 ఖర్చు పెట్టి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు. మహేష్‌పై ఉన్న అభిమానంతో పాటు ఈ సినిమాపై ఉన్న హైప్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రైమ్ ఇలా చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే కొందరు మాత్రం థియేటర్‌లో ఖర్చు పెట్టి చూసిన మూవీని ఓటీటీలో కూడా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రాన్ని ఉచితంగా వీక్షించేందుకు ప్రైమ్ డేట్ ఫిక్స్ చేసింది. జూన్ 23 నుండి సర్కారు వారి పాట సినిమాను అమెజాన్ ప్రైమ్ ఉచితంగా స్ట్రీమింగ్ చేయనుంది. గతంలో కేజీఎఫ్-2 సినిమాకు అనుసరించిన విధానాన్నే సర్కారు వారి పాట సినిమా విషయంలోనూ ప్రైమ్ అమలు చేసింది. దీంతో మరిన్ని డబ్బులను పోగు చేసుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా సర్కారు వారి పాట సినిమాను నిర్మించారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…