Home Entertainment సర్కారు వారి పాట క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

సర్కారు వారి పాట క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
13,203

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాత సినిమా ఇటీవల విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా, మొదటి రోజు మొదటి ఆట నుండే ఆశించిన స్థాయి అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ..మహేష్ బాబు కి ఉన్న విపరీతమైన ఫామిలీ ఆడియన్స్ క్రేజ్ వల్ల ఈ సినిమా గట్టెక్కేసింది..ఈ సినిమా కి మొదటి రోజు సోషల్ మీడియా లో వచ్చిన ఆన్లైన్ రేటింగ్స్ కి బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ కి ఏ మాత్రం పొంతన లేదు అనే విషయాన్నీ మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సిందే..విడుదల అయ్యి సక్సెస్ గా మూడు వారాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు క్లోసింగ్ కి దగ్గర్లో ఉంది..ఇది ఇలా ఉండగా విడుదల రోజు నుండి ఈ సినిమా వసూళ్ల పై ఎవ్వరికి కూడా సరైన క్లారిటీ లేదు..ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఈ మూవీ కి భారీ హైప్ నంబర్స్ ఇవ్వడమే దానికి కారణం అని తెలుస్తుంది..అయితే వచ్చిన ఒరిజినల్ కలెక్షన్స్ ఎంత అనే దానిపై సుదీర్ఘమైన పరిశీలనా చేసి క్లోసింగ్ కలెక్షన్స్ ఇప్పుడు మేము ఈ ఆర్టికల్ ద్వారా మీ ముందు ఉంచబోతున్నాము.

మొదటి రోజు నుండి ఈ సినిమా కి వచ్చిన నైజం ప్రాంతం కలెక్షన్స్ లో భారీ ఫేక్ ఉంది అని ట్రేడ్ వర్గాలు సైతం సోషల్ మీడియా లో ఆరోపించాయి..మొదటిలో రోజు ఈ సినిమా ఇక్కడ 11 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..కానీ నిర్మాతలు ఈ సినిమాకి మొదటి రోజు ఏకంగా 12 కోట్ల 64 లక్షల రూపాయిలు వచ్చింది అని, ఇది ఒక్క ఆల్ టైం రికార్డు అని చెప్పుకొచ్చారు..ఒక్క మొదటి రోజు మాత్రమే కాదు, ఫుల్ రన్ వరుకు ఈ సినిమాకి భారీ ఫేక్ జరిగింది..అయితే మాకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం..ఈ సినిమా ఫుల్ రన్ లో నైజం ప్రాంతం లో 30 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వసూలు చేసినట్టు తెలుస్తుంది..అలాగే రాయలసీమ ప్రాంతం లో 11 కోట్ల రూపాయిల షేర్, వైజాగ్ లో 12 కోట్ల రూపాయిల షేర్, ఈస్ట్ గోదావరి లో 7 కోట్ల రూపాయిల షేర్, వెస్ట్ గోదావరి లో 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక నెల్లూరు లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది..ఇక్కడ ఈ సినిమా దాదాపుగా ౩కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసినట్టు సమాచారం.

ఇక ఆంధ్ర లో మహేష్ బాబు కి మంచు పట్టు ఉన్న ప్రాంతాలు అయినా కృష్ణ , గుంటూరు జిల్లాలలో ఈ సినిమా దుమ్ము లేపేసింది అనే చెప్పొచ్చు..కృష్ణ జిల్లాలో 5 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, గుంటూరు జిల్లాలో ఆరున్నర కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక రెండు తెలుగు రాష్ట్రాల వసూళ్లను కాసేపు పక్కన పెడితే ఈ సినిమాకి మిగిలిన ప్రాంతాలలో ఆశించిన స్థాయి వసూళ్లు అయితే రాలేదు..మహేష్ బాబు కి స్ట్రాంగ్ ఫోర్ట్ అయినా అమెరికా లో ఈ సినిమా ఫుల్ రన్ లో కేవలం రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది..ఇక్కడ ఈ సినిమా లాస్ వెంచర్ అనే చెప్పొచ్చు..ఇక కర్ణాటక లో అయితే ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అనే చెప్పాలి..ఇక్కడ కేవలం ఈ సినిమా 3 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే రాబట్టింది..ఇక మిగిలిన ఓవర్సీస్ ప్రాంతాలు మరియు చెన్నై అన్ని కలిపి ఈ సినిమా ౩కోట్ల 55 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..మొత్తం మీద ఈ సినిమాకి ఫుల్ రన్ లో 93 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది అన్నమాట..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు జరిగింది..దాదాపుగా బయ్యర్స్ కి 27 కోట్ల రూపాయిల నష్టాన్ని మిగిలించి యావేరేజి గ్రోస్సర్ గా నిలిచింది ఈ చిత్రం.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…