
లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే ఈ జంట నవ దంపతుల నుంచి తల్లిదండ్రులుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో వీళ్లు సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అయ్యారని తెలిసింది. అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడాన్ని సరోగసీ అంటారు. అంటే ఇక్కడ వేరే మహిళ, పురుషులకు చెందిన బిడ్డను మరొక మహిళ తన గర్భంలో మోస్తారు. బిడ్డను మోసే మహిళకు ఆ బిడ్డ మీద ఎటువంటి హక్కులు ఉండవు. అండం, వీర్యం ఇచ్చిన వారే ఆ బిడ్డకు తల్లిదండ్రులు అవుతారు. గతంలో విదేశీయులు అద్దె గర్భం కోసం ఇండియన్ మహిళలను సంప్రదించేవారు. ఇది వ్యాపారంగా మారిపోవడంతో ఇండియన్ గవర్నమెంట్ విదేశీలకు ఇండియాలో సరోగసీ విధానాన్ని రద్దు చేసింది. సరోగసీకి సంబంధించి డిసెంబర్ 2021లో పార్లమెంటు రెండు చట్టాలను ఆమోదించింది. అయితే సరోగసీని నయనతార జంట చట్టప్రకారం వినియోగించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ప్రకారం ఏదైనా ఒక జంట వివాహం అయిన ఐదేళ్ల తరువాత మాత్రమే సరోగసీను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం జనవరి 2022 నుంచే అమల్లోకి వచ్చింది.
కానీ పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసీ ద్వారా నయనతార జంట కవలలను పొందడం చట్టవిరుద్ధమని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమకు పిల్లలు ఎలా పుట్టారో వివరించాలని తమిళనాడు ప్రభుత్వం నయనతార-విఘ్నేష్ శివన్ జంటకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొద్ది రోజులుగా సరోగసీ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. 2019లో ఈ పద్దతి ద్వారా పిల్లలను కనడం చట్టరీత్యా నేరమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. అయినా చట్టాన్ని ఉల్లంఘించి నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే ఆమెను చిక్కులో పడేసింది. సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్‌లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసీ ద్వారా కాదు… పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే లీగల్‌గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. చట్ట పరంగా దత్తత తీసుకుంటే ఫర్వాలేదు. లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. దీంతో నయనతార దంపతులు జైలుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇంత జరుగుతున్నా నయన్ దంపతులు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం నయనతార, విఘ్నేష్ శివన్ తమ వివాహం ఆరేళ్ల క్రితమే జరిగిపోయిందని ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆరేళ్ల క్రితమే తమ వివాహం రిజిస్టర్ అయినట్లుగా పత్రాలను కూడా సమర్పించారట.
ఆరేళ్ల క్రితమే నయనతార పెళ్లి జరిగిందని తెలుసుకున్న అభిమానులు షాక్‌కు గురి అవుతున్నారు. అయితే సరోగసీ విధానంలో పిల్లలను కన్న ఈ జంట ఇప్పుడు సేఫ్ అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం నుంచి బయట పడేందుకు ఏం చేయాలో నయనతార, విఘ్నేష్ శివన్ సమానాలోచనలో పడ్డారు. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం మేరకు నయన తార, విఘ్నేష్ శివన్‌లకు ఈ వివాదంలో సమస్య ఉండదట. ఎందుకంటే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన తల్లి దుబాయ్‌లో ఉంది. నయనతార సోదరుడు ఆమెను ఒప్పించినట్లు తెలుస్తుంది. దుబాయ్‌లో సరోగసీ విధానానికి ఎలాంటి నిబంధనలు లేవు కాబట్టి నయన్, విఘ్నేష్‌లకు సమస్య ఉండబోదని అంటున్నారు. అయితే వారు విచారణను మాత్రం ఫేస్ చేయాల్సి ఉంటుందట. ఈ వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. గతంలో మంచు లక్ష్మీ, ప్రియాంక చోప్రా, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ వంటి వారు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారు.