
సమంత ప్రధాన పాత్ర లో నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘యశోద’ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వుబ్బినమైన కథాంశాలతో ఎప్పుడు ప్రేక్షకులను అలరించాలని చూసే సమంత ఈ చిత్రం ద్వారా మరోసారి సరికొత్త ప్రయోగానికి తెరలేపింది..టీజర్ మరియు ట్రైలర్ అదిరిపోయింది..ఈ సినిమాకి హరి మరియు హరీష్ అనే ఇద్దరు దర్శకులు పని చేసారు..ఇక లేడీ విలన్ గా సౌత్ ని ఏలేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో విలన్ గా నటించగా..మలయాళం యువ హీరో ఉన్ని ముకుందన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు..సంపత్ రాజ్, మురళి శర్మ , రావు రమేష్ ప్రధాన పాత్రలు పోషించగా మణిశర్మ సంగీతం అందించాడు..ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 40 కోట్ల రూపాయిల వరుకు అయిపోయిందట..సమంత మార్కెట్ కి మించి అంత బడ్జెట్ పెట్టేసారు.
రిస్క్ అనిపించలేదా అని నిర్మాతలను ప్రొమోషన్స్ లో అడగగా..నిర్మాతలు దానికి సమాధానం చెప్తూ ‘మేము కథని నమ్మి చేసాము..ఈమధ్య కాలం లో గమనిస్తే స్టార్ హీరోల సినిమాల కన్నా కూడా కథ బలం ఉన్న సినిమాలే ఆడుతున్నాయి..మా చిత్రం కథ మీద కూడా మాకు అలాంటి నమ్మకమే ఉంది’ అని చెప్పుకొచ్చారు..ఈ సినిమా కథ నిజజీవితం లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకొని తీశారు..ఈమధ్య కాలం లో సరోగసి ద్వారా పిల్లల్ని కనడం ఒక ట్రెండ్ గా మారింది..నయనతార మరియు విగ్నేష్ దంపతులు కూడా అలాగే సంతానం ని పొందారు..ఆలా ఒక ధనవంతుల కుటుంబానికి బిడ్డని ఇవ్వడానికి ఒక కాంట్రాక్టు మీద ఒప్పుకుంటుంది సమంత..అలా గర్భం దాల్చి ఉన్న సమంత పై దాడులు చెయ్యడం ప్రారంభిస్తారు విలన్స్..వాళ్ళు సమంత మీద దాడి ఎందుకు చేయాలనుకున్నారు..అసలు విలన్స్ కి సమంత కి మధ్య గతం లో ఏమి జరిగింది అనేది చాలా సస్పెన్స్ తో కూడిన థ్రిల్ మూమెంట్స్ తో ఈ సినిమాని తీర్చి దిద్దారట.
సమంత మరోసారి ఈ చిత్రం ద్వారా చాలంజింగ్ రోల్ ని అద్భుతంగా చేసింది..ఒక్కమాటలో చెప్పాలంటే తన నటవిశ్వరూపం చూపించేసింది..తన అందం తో యువతని మాతెక్కించడమే కాదు..యాక్షన్ సన్నివేశాలలో కూడా హీరోలతో సరిసమానంగా ఫైట్స్ చెయ్యగలను అని ఈ సినిమా ద్వారా నిరూపించింది సమంత..ఇక వరలక్ష్మి శరత్ కుమార్ విలనిజం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముందు సినిమాలకంటే ఈ సినిమాలో మరింత ఎక్కువ విలనిజం పండించి సినిమాకి హైలైట్ గా మారింది..మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి..సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరుకు ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే తో సాగే ఈ సినిమాని కచ్చితంగా థియేటర్స్ లో మిస్ అవ్వకుండా చూడాలిసిందే..పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి..చూడాలిమరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.