
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రం ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి మనకి తెలిసిందే..ఓపెనింగ్స్ కూడా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలలో అదిరిపోయాయి..కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రానికి దాదాపుగా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి..కానీ ఫుల్ రన్ లో మాత్రం ఈ సినిమా ఊహించిన రేంజ్ లో వసూళ్లను రాబట్టలేకపోయింది..వీక్ డేస్ లో కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి..ఇక వీకెండ్స్ లో కూడా ఊహించిన రేంజ్ గ్రోత్ ని చూపించలేకపోయింది..కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ తక్కువకి జరగడం వల్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ స్టేటస్ ని అందుకుంది..కానీ ఇతర బాషలలో కలెక్షన్స్ మాత్రం కనీస స్థాయి లో కూడా రాబట్టలేకపోయింది..ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తోనే నిర్మాత దాదాపుగా 45 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం పెట్టాడు.
కానీ నిర్మాతల అంచనా తప్పింది..తమిళం , హిందీ మరియు మలయాళం బాషలలో ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది..ఈ భాషలన్నీ కలిపి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది ఈ చిత్రం..తెలుగు లో ఇప్పటి వరుకు ఈ చిత్రం కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండి 8 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..అయితే అన్ని ప్రాంతాల పెర్ఫార్మన్స్ తో పోలిస్తే ఈ సినిమాకి నైజాం ప్రాంతం నుండి మంచి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి..అక్కడ ఈ చిత్రానికి దాదాపుగా 4 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..నైజాం ప్రాంతం తర్వాత ఈ సినిమాకి మంచి వసూళ్లను తెచ్చిపెట్టిన ప్రాంతం ఉత్తరాంధ్ర..ఇక్కడ ఈ సినిమాకి దాదాపుగా కోటి 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇక తర్వాత సీడెడ్ 88 లక్షలు, కృష్ణ 60 లక్షలు, గుంటూరు 54 లక్షలు, ఈస్ట్ గోదావరి 53 లక్షలు , వెస్ట్ గోదావరి 32 లక్షలు మరియు నెల్లూరు 27 లక్షలు ఇలా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 8 కోట్ల 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాకి ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్ వచ్చింది..కేవలం మూడు రోజుల్లోనే అక్కడ 5 లక్షల డాలర్లు వసూలు చేసింది కానీ, ఫుల్ రన్ లో కేవలం 7 లక్షల డాలర్ల వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది..అయితే బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీల గా ఈ చిత్రం ఇక్కడ కూడా అందుకుంది కానీ ప్రెస్టీజియస్ 1 మిలియన్ మార్కు ని కూడా అందుకొని ఉంటె బాగుండేదని ఫాన్స్ అభిప్రాయం.. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అన్ని ప్రాంతాలకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 12 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ లో రెండు కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించింది ఈ చిత్రం..ఇక దాదాపుగా ఈరోజుతో రన్ ముగిసినట్టే..ఎందుకంటే అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘మారేడుమల్లి నియోజకవర్గం’ అలాగే తమిళ్ లో రీసెంట్ సూపర్ హిట్ గా నిలిచినా ‘లవ్ టుడే’ చిత్రాలు విడుదలయ్యాయి..దీనితో ఈరోజు నుండి యశోద కి షేర్స్ రావడం ఆగిపోతుందని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.