Home Entertainment సమంత నాగ చైతన్య విడాకుల పై కంటతడి పెడుతూ మాట్లాడిన అక్కినేని నాగార్జున

సమంత నాగ చైతన్య విడాకుల పై కంటతడి పెడుతూ మాట్లాడిన అక్కినేని నాగార్జున

0 second read
0
0
1,049

మన టాలీవుడ్ లో ఇద్దరు సినీ తారలు పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు అనే వాదన ఉంది,ఇద్దరు సినీ తారలు వైవాహిక జీవితం ని అద్భుతంగా సాగించిన వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉంటారు,కానీ ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం విడిపోయిన వారే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు,అలాంటి వారి జాబితా లో చేరిపోయారు నాగ చైతన్య మరియు సమంతల జంట, ఏం మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయినా సమంత ఆ సినిమా తన కెరీర్ ని ఎంతలా మలుపు తిప్పిందో , తన వ్యక్తిగత జీవితం ని కూడా అలాగే ఊహించని మలుపులు తిప్పింది, ఈ సినిమా ద్వారా పరిచయం అయినా వీళ్లిద్దరి స్నేహం అది ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకునేలా చేసింది, 2017 వ సంవత్సరం లో వీళ్లిద్దరి పెళ్లి సినీ మరియు రాజకీయ ప్రముఖుల మధ్య అంగరంగ వైబవంగా జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే, ఇన్ని రోజులు ఎంతో సజావుగా సాగిన వీళ్లిద్దరి దాంపత్య జీవితానికి ఇటీవలే బ్రేకులు పడింది, మేమిద్దరం విడాకులు తీసుకున్నాం అంటూ ఇటీవల నాగ చైతన్య మరియు సమంతలు సోషల్ మీడియా వేదికగా తెలపగా వీళ్లిద్దరి అభిమానులు తీవరమైన దుఃఖానికి గురి అయ్యారు, మేడ్ ఫర్ ఈచ్ అథెర్ అని ఇంతకాలం అనుకున్న అభిమానులకు వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్త కోలుకోలేని షాక్ కి గురి అయ్యేలా చేసింది.

ఇక తన కొడుకు మరియు కోడలు విడిపోయారు అనే వార్తని జీర్ణించుకోలేక బరువెక్కిన హృదయం తో అక్కినేని నాగార్జున నిన్న సోషల్ మీడియా లో పెట్టిన ఒక్క ట్వీట్ అభిమానులకు కంఠాది పెట్టెల చేసింది, వాస్తవానికి ఎంతో కాలం నుండి సోషల్ మీడియా లో నాగ చైతన్య మరియు సమంతలు విడిపోయారు అనే వార్త ప్రచారం అవుతూ ఉన్నింది, అయితే ఇందులో ఎంత మాత్రం నిజం అనేది ఎవ్వరికి తెలిసేది కాదు, కానీ నాగార్జున పుట్టిన రోజు నాడు సమంత హ్యాపీ బర్త్ డే మావయ్య అంటూ ఎంతో భావోద్వేగం తో కూడిన ఒక్క ట్వీట్ వేసేసరికి విడాకుల వార్త కేవలం పుకారు మాత్రమే అని అందరూ అనుకున్నారు, కానీ ఇంతలోపే వీళ్లిద్దరు విడిపోయారు అని అధికారికంగా ప్రకటించేసరికి అభిమానుల్లో తీవ్రమైన విషాద వాతావరణం నెలకొంది, ఇక వీళ్లిద్దరి విడాకుల గురించి నాగార్జున మాట్లాడుతూ ‘ఈరోజు సమంత మరియు నాగ చైతన్య విడిపోవడం నా హృదయాన్ని కలిచివేసింది,వాళ్ళిద్దరి మధ్య ఏమి జరిగింది అనేది పూర్తిగా వారి వ్యక్తిగతం, కానీ వాళ్లిదరు నా మనసుకు ఎంతో దగ్గర అయినా వ్యక్తులు,సమంత తో కలిసి మా కుటుంబం మొత్తం గడిపిన మధుర క్షణాలు జీవితాంతం మేము గుర్తు పెట్టుకుంటాము,వాళ్ళిద్దరి జీవితాలకు భవిష్యత్తులో ఆ దేవుడి ఆశీసులు మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎంతో బావోద్వేగంగా ఒక్క ట్వీట్ వేశారు నాగార్జున.

ఇక వీళ్లిద్దరి సినీ కెరీర్ విషయానికి వస్తే నాగ చైతన్య మరియు సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లవ్ స్టోరీ సినిమా ఇటీవలే విడుదల అయినా అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే, విడుదలకి ముందే బ్లాక్ బస్టర్ సాంగ్స్ వాళ్ళ ఎంతో హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం గా సరికొత్త రికార్డు నెలకొల్పింది,ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఒక్క హర్రర్ వెబ్ సిరీస్ లో నటించనున్నాడు, ఇక తమ ఫామిలీ కి మనం వాకాటి సెన్సషనల్ హిట్ ని ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కలిసి థాంక్యూ అనే సినిమా లో నటిస్తున్నాడు, ఇక సమంత విడాకులు తర్వాత తన బేస్ ని మొత్తం ముంబై కి షిఫ్ట్ చెయ్యబోతున్నట్టు సమాచారం, ప్రస్తుతం ఆమె గుండా శేఖర్ తో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది, ఈ సినిమా తో పాటు తమిళ్ లో విజయ్ సేతు పతి తో కలిసి ఒక్క సినిమాలో నటిస్తుంది, కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా నటన కి ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చెయ్యడానికి సమంత ఇప్పుడు ఆసక్తి చూపుతుంది, మరి విడాకులు తర్వాత వీళ్లిద్దరి సినీ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…