
టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత గత ఏడాది అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. అప్పటి నుంచి ఈ కపుల్‌కు సంబంధించి ఏ వార్త రాసినా హాట్ టాపిక్‌గానే మారుతోంది. కొందరు సమంత బిహేవియర్ కారణంగానే చైతూ విడాకులు తీసుకున్నాడని ప్రచారం చేయగా.. మరికొందరు సమంతకు చైతూ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని.. చాలా నిబంధనలు పెడుతుండటం ఇష్టం లేకే అతడి నుంచి విడిపోయిందని ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఇటీవల సమంత బాలీవుడ్ టాప్ టాక్ షో కాఫీ విత్ కరణ్‌లో కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. చైతూతో తన విడాకులు సామరస్యంగా జరగలేదని వివరించింది. అయితే సమంత వ్యాఖ్యలపై మీడియా భూతద్దం పెట్టి వెతుకుతోంది. ఈ వ్యవహారం వెనుక ఎవరో కీలక వ్యక్తి ఉండి ఉంటారంటూ పలు కథనాలు ప్రచురించింది.
తాజాగా ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్‌కే సమంత, చైతూ విడాకులపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. వీళ్లిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అని ఆరోపించాడు. ఇందుకు సంబంధించి తన దగ్గర పూర్తి స్టోరీ ఉందని త్వరలోనే దానిని బయట పెడతానని కేఆర్‌కే వెల్లడించాడు. చైతూ తన భార్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగ చైతన్యను ఎలా ఒప్పించాడో కూడా కేఆర్‌కే వివరించాడు. సమంత కారణంగా చైతూ గుండె జారిపోయిందని.. ఎంతో బాధను అనుభవించాడని పేర్కొన్నాడు. ఈ మేరకు తో భాయ్ ఐసే ఆద్మీ కి ఫిల్మ్ తో నహీ చల్ శక్తి అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. దీంతో ప్రస్తుతం కేఆర్‌కే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అసలు ఆయన వ్యాఖ్యల్లో ఎంత వరకు నిజం ఉందో అని నెటిజన్‌లు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ సినిమాలో నాగచైతన్య కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమానే లాల్ సింగ్ చద్దా. ఈ మూవీ ఆగస్టు రెండో వారంలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
కాగా బాలీవుడ్ విమర్శకుడు కేఆర్‌కే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ తనదైన శైలిలో తెలుగు సినిమాలపై ఆయన సెటైర్లు వేస్తుంటాడు. ఇటీవల రాజమౌళి తెరకెక్కించి ఆర్.ఆర్.ఆర్ సినిమాను కూడా కేఆర్‌కే విమర్శించాడు. ఇదొక చెత్త సినిమా అంటూ అభివర్ణించాడు. అంతేకాదు యష్ రాజ్ ఫిల్మ్స్‌ను దారుణంగా దూషించాడు. గతంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ను ఎన్నో మాటలు అన్నాడు. ఇలా ఆయన ఇటీవలి కాలంలో చాలాసార్లు వార్తల్లో నిలిచాడు. తాజాగా చైతూ, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ బాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఆయన కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలుత 1986న ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాలో నటించిన నటి రీనా దత్తాను ఆయన వివాహం చేసుకున్నాడు. వీనికి ఒక కుమారుడు జునైద్, కుమార్తె ఇరా ఉన్నారు. ఆ తర్వాత డిసెంబరు 2002న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు రెండో భార్య కిరణ్‌రావుతో కూడా విడిపోయాడు.