Home Entertainment సమంత తో వైవాహిక జీవితం గురించి తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అక్కినేని నాగ చైతన్య

సమంత తో వైవాహిక జీవితం గురించి తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన అక్కినేని నాగ చైతన్య

0 second read
0
0
3,416

గత ఏడాది పై నుండి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారా అంటే మనకి టక్కుమని గుర్తుకు వచ్చే పేర్లు సమంత మరియు నాగ చైతన్య..ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది..వీళ్లిద్దరు విడిపోయిన విషయం వాళ్ళు కూడా మర్చిపొయ్యి ఉండొచ్చు..ఎందుకంటే ఎవరి కెరీర్ లో వారు క్షణం తీరిక లేకుండా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు..కానీ అభిమానులు మాత్రం వీళ్లిద్దరి గురించి మాట్లాడుకొని రోజు అంటూ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..సోషల్ మీడియా లో ఉండే వెబ్సైట్లు మరియు యూట్యూబ్ చానెల్స్ అయితే వీళ్లిద్దరి మీదనే ఇప్పటికి కథనాలు రాస్తూ TRP రేటింగ్స్ ని సంపాదించుకుంటున్నాయ్..ఇక ఇటీవలే సమంత బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ అనే ప్రోగ్రాం లో ముఖ్య అతిధి గా హాజరు అయ్యింది..ఈ షో లో సమంత తన వైవాహిక జీవితంగా గురించి ఏమి మాట్లాడకపోయినా..నాగ చైతన్య పై పరోక్షంగా ఎన్నో విమర్శలు చేసింది సమంత..ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ గా మారింది.

విడిపోయిన తర్వాత సమంత నాగ చైతన్య పై పరోక్షంగా కామెంట్స్ చెయ్యడం కొత్తేమి కాదు..ఇంస్టాగ్రామ్ లో కూడా ఎన్నో స్టోరీస్ పెడుతూ వచ్చింది నాగ చైతన్య కి సెటైర్లు వేస్తూ..అయితే నాగ చైతన్య మాత్రం సోషల్ మీడియా లో వచ్చే రూమర్స్ పై ఎలాంటి స్పందన చెయ్యకుండా తన పని ఏమిటో తానూ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు..అయితే ఆయన బాలీవుడ్ లో అమిర్ ఖాన్ హీరో గా నటించిన లాల్ సింగ్ చడ్డా లో ఒక ముఖ్య పాత్ర పోషించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం ఆగష్టు 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సందర్భంగా నాగ చైతన్య కూడా ఈ సినిమా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు..అయితే ఆయన ఎక్కడికి వెళ్లిన సమంత గురించి అడగకుండా ఉండలేకున్నారు విలేకరులు..వీళ్లిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయం తెలుసుకోవడం పై అంత ఆసక్తి అన్నమాట అందరికి..అయితే ఇన్నాళ్లకు తొలిసారి నాగ చైతన్య విడాకులు గురించి ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆయన మాట్లాడుతూ ‘మేమిద్దరం కలిసి ఉండడం కుదర్లేదు విడిపొయ్యాం..ఇప్పుడు ఎవరి జీవితం ని వారు చూసుకుంటూ సంతోషంగా ఉన్నాం..కానీ మీకు ఎందుకు మా గురించి అంత అమితాసక్తి..సోషల్ మీడియా లో వస్తున్నా రూమర్స్ ని గమనిస్తూనే ఉన్నాను..నేను వేరే అమ్మాయి తో ఎఫైర్ పెట్టుకోవడం వల్ల మా మధ్యన గొడవలు వచ్చి విడిపొయ్యాం అని కొంతమంది..సమంత కి ప్రేగ్నసీ లేదు ..అందుకే వదిలేసాను అని మరికొంత మంది..కొంతమంది అయితే ఏకంగా నాకు రెండవ పెళ్లి కూడా చేసేసారు..చూసేవాళ్ళు ఉన్నారు కదా అని నోటికి ఏది పడితే అది రాసేస్తున్నారు..ఇది కరెక్ట్ కాదు..మేము మీలాంటి మాములు మనుషులమే..మాకంటూ కొన్ని ప్రైవసీలు ఉంటాయి..మా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం లేదు..దయచేసి డిగ్నిటీ పాటించండి’ అంటూ నాగ చైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

పెళ్ళైన హీరో తో పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన హీరోయిన్ కైరా అద్వానీ..షాక్ లో ఫాన్స్

చేసిన రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోవడం అంటే మాములు విషయం కాదు..మన ఇండస…