
అక్కినేని నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్న విషయం వాళ్ళైనా మర్చిపొయ్యి ఉంటారేమో కానీ..సోషల్ మీడియా లో గాసిప్ వెబ్సైట్స్ మాత్రం ఇప్పట్లో మర్చిపొయ్యేలా లేరు..రోజు వీళ్ళ గురించి ఎదో ఒక వార్త రాయడం డబ్బులు సంపాదించడమే వీళ్ళ పని..సమంత మీద అయితే విడాకులు తీసుకున్న కొత్తల్లో చాలా అసభ్యకరమైన గాసిప్స్ రాయడం మొదలు పెట్టారు..చూసి చూసి సహనం కోల్పోయిన సమంత ఒక్కసారిగా ఫైర్ అయ్యి తన పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారందరి పై హైకోర్టు లో కేసు కూడా వేసింది..కానీ నాగ చైతన్య సంగతి తెలిసిందే గా..చాలా కూల్ మరియు కంపోజ్డ్ పర్సన్..తన పై ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఏ మాత్రం పట్టించుకోడు..తన పని తానూ చేసుకుంటూ ముందుకు పోతాడు..నాగ చైతన్య నెగటివిటీ ని బాగా దూరం పెడుతాడు..సోషల్ మీడియా వాడకం కూడా చాలా తక్కువ..తన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ వివరాలు షేర్ చెయ్యడం తప్ప ఆయన ఎక్కువగా అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడు..అయితే మొట్టమొదటిసారి ఆయన తన విడాకులు గురించి పెదవి విప్పాడు.
ఆయన మాట్లాడుతూ ‘నేను సమంత తో విడిపోవడానికి నాకు ఉండాల్సిన కారణాలు నాకు ఉన్నాయి..ఆ అమ్మాయి కూడా విడాకులే కోరుకుంది..ఇప్పుడు ఇద్దరం సంతోషంగానే ఉంటున్నాం..కలిసి సంతోషం గా లేనప్పుడు విడిపోవడమే కరెక్ట్ కదా..మేము ఎందుకు విడిపోయాము ఏమిటి అనే విషయాన్నీ మీరు తెలుసుకొని ఏమి చేస్తారు..దాని వాళ్ళ మీకేమైనా ఉపయోగం ఉందా..దయచేసి లైట్ తీసుకోండి..ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నాము..మీరు మీ పని చూసుకోండి..సోషల్ మీడియా వంద వస్తాయి..వాటిని నమ్ముకుంటూ కూర్చుంటే ఏమి జరగదు’ అంటూ చెప్పుకొచ్చారు నాగచైతన్య..ఒకవేళ సమంత తో కలిసి నటించే ఛాన్స్ వస్తే నటిస్తారా అని నాగ చైతన్య ని అడగగా , దానికి ఆయనకీ సమాధానం ఇస్తూ ‘ఈ ఆలోచన చాలా క్రేజీ గా ఉంది..బిజినెస్ గా కూడా బాగా వర్కౌట్ అవుతుంది..నాకు సమంత తో కలిసి నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు..కానీ దేవుడు ఎలా రాసి ఉన్నాడో ఎవరికీ తెలియదు కదా..రాసిపెట్టి ఉంటె మేమిద్దరం మల్లి కలిసి నటించొచ్చు’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఆయన హీరో గా నటించిన ‘థాంక్యూ’ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగచైతన్య కెరీర్ కి ఈ సినిమా పెద్ద బ్రేక్ వేసింది అనే చెప్పాలి..కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ ని కూడా ఈ సినిమా దక్కించుకోలేక పోయింది అంటే ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు..ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ప్రస్తుతం గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు..దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది..ఇది అలా పక్కన పెడితే బాలీవుడ్ సూపర్ స్టార్ అమిర్ ఖాన్ హీరో గా నాగ చైతన్య ముఖ్య పాత్ర పోషించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఈ నెల 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది..ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ గా బలంగా ఉపయోగపడుతుంది అని అక్కినేని అభిమానులు నమ్ముతున్నారు..మరి థాంక్యూ సినిమా ఫలితం తో డీలా పడిన అక్కినేని అభిమానులను నాగ చైతన్య ఈసారైనా అలరిస్తాడో లేదో చూడాలి.