
టాలీవుడ్ మోస్ట్ లవ్‌లీ కపుల్‌గా పేరుతెచ్చుకున్న నాగచైతన్య, సమంత జంట విడిపోయి ఏడునెలలు దాటిపోతోంది. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఈ జంటకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బీభత్సంగా పెరిగారు. దీంతో వీళ్లు విడాకులు తీసుకున్న తర్వాత వీరికి సంబంధించిన ఏ వార్త అయిన సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న నాటి నుంచి సమంత ఎమోషనల్ కోట్స్ పోస్ట్ చేయడం, రిలేషన్‌ను మిస్ అవుతున్నట్లు పోస్టులు పెట్టడం వంటివి వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం నాగచైతన్యకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. త్వరలో నాగచైతన్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగార్జున కొన్ని రోజుల నుంచి చిన్నకొడుకు అఖిల్ కోసం మంచి సంబంధాల కోసం వెతుకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగచైతన్యకు కూడా వివాహం చేయాలని నాగార్జున భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
ఇటీవల సమంత తండ్రిని నాగార్జున స్వయంగా కలిసినట్లు వార్తలు వచ్చాయి. సమంత తండ్రితో దాదాపు గంట సేపు నాగార్జున మంతనాలు జరిపారని.. చైతూ-సమంత మధ్య సంధి కుదిర్చేందుకు ఆఖరి ప్రయత్నంగా నాగ్ ఇలా కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చర్చలు విఫలమైతే చైతూకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చైతూ, సమంత ఇద్దరూ విడాకులు అయిపోయి ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేస్తున్నా భవిష్యత్‌లో భరణం, ఇతర విషయాలపై ఇరువురికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా నాగ్ మంతనాలు జరిపినట్లు మరో టాక్ వినిపిస్తోంది. మరి వీటిలో ఏ వార్త నిజమో నాగార్జున స్వయంగా స్పందిస్తే స్పష్టత వస్తుంది. ఏదేమైనా సమంత తండ్రిని నాగ్ కలవడం అయితే పక్కా నిజం కాబట్టి ఏదో ఒక డిస్కషన్ అయితే జరిగి ఉంటుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.
అయితే నాగచైతన్యను సమంత పెళ్లి చేసుకోవడం ముందు నుంచీ సమంత తల్లిదండ్రులకు ఇష్టం లేదని.. సమంతే బలవంతంగా వారిని ఒప్పించి పెళ్లి చేసుకుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. తీరా విడిపోయిన తర్వాత వీరిని కలిపేందుకు నాగార్జున చేసిన ప్రయత్నాలు గతంలో బెడిసి కొట్టాయి. ఇద్దరూ మేజర్లు కాబట్టి వాళ్ల జీవితాలను వాళ్లకే వదిలేశామని… సమంత విడిపోయినా తమ ఇంటి ఆడ బిడ్డేనని నాగ్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. మరి ఇప్పుడు సమంత తండ్రిని ఆయన కలవడంపై ఆంతర్యం ఏంటో మాత్రం అంతుచిక్కని వ్యవహారంలా మారింది. కాగా విడాకుల తర్వాత సమంత, చైతు ఇద్దరూ కూడా ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు. సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాతో పాటు యశోద అనే థ్రిల్లర్ సినిమా కూడా చేస్తోంది. అటు విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి సినిమాలో కూడా సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అటు బాలీవుడ్ వెబ్ సీరిస్‌లతో పాటు హాలీవుడ్ సినిమాలకు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. చైతూ కూడా థాంక్యూ అనే సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌ను పూర్తి చేశాడు. మరిన్ని ప్రాజెక్టులకు కూడా పచ్చజెండా ఊపాడు.